జగిత్యాలలో పెట్రోల్ నిల్వలు పుష్కలం: కలెక్టర్ సత్యప్రసాద్

 జగిత్యాలలో పెట్రోల్ నిల్వలు పుష్కలం: కలెక్టర్ సత్యప్రసాద్
బంక్ యజమానులతో అత్యవసర సమీక్ష.. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం!
రైతులకు ఇబ్బంది కలగొద్దు.. ముందస్తుగా ఇండెంట్ పెట్టాలని ఆదేశం


జగిత్యాల (బ్యూరో): జిల్లాలో పెట్రోల్ సరఫరా, నిల్వలపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జరిగిన ఈ భేటీలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, చమురు సంస్థల ప్రతినిధులు మరియు బంక్ యజమానులతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.  జిల్లాలోని అన్ని బంక్‌లలో ఉన్న నిల్వలు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న అమ్మకాల గణాంకాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా కొరత రాకుండా లోడింగ్ పెంచాలని చమురు సంస్థలను ఆదేశించారు.


లాభాల కోసం పెట్రోల్‌ను అక్రమంగా నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నిల్వల దృష్ట్యా ముందస్తుగానే కంపెనీలకు ఇండెంట్ పంపాలని సూచించారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా వ్యవసాయ వాహనాలకు పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉంచాలని, వ్యాపారస్తులకు అనవసరంగా అమ్మకాలు జరపవద్దని ఆదేశించారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు. భయంతో అనవసరంగా పెట్రోల్‌ను డబ్బాల్లో నిల్వ చేసుకోవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరా అధికారి జితేందర్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్లు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!