ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ప్రారంభించిన ప్రభుత్వ విప్, కలెక్టర్
TOOFAN - JAGTIAL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం ప్రజపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అంబర్పేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల విస్తరణలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంబారిపేటతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు.
వైద్య సిబ్బంది ప్రజలకు సానుభూతితో సేవలు అందించాలని సూచించారు. ఈ కేంద్రంలో అవుట్ పేషెంట్ సేవలు, ప్రసూతి సేవలు, టీకా కార్యక్రమాలు, ప్రాథమిక చికిత్సలు అందించబడతాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో కూడా ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుభ్రత, పోషకాహారం, ఆరోగ్య నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంబారిపేట గ్రామానికి మరియు పరిసర గ్రామాలకు ఈ PHC ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇలాంటి సదుపాయం ఏర్పాటు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ జివాకర్ రెడ్డి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సుజాత, డిప్యుటీ DMHO జైపాల్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో శంకర్, స్థానిక సర్పంచ్ వేముల లక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, పాల్గొన్నారు. https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

Comments
Post a Comment