జగిత్యాల జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

 TOOFAN - JAGTIAL : జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధ్యక్షతన, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత సమక్షంలో ఐడీఓసీ (IDOC) కలెక్టరేట్, జగిత్యాల సమావేశ మందిరంలో శనివారం ఆర్డీవోలు, తహసీల్దార్లు మరియురెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న వివిధ రెవెన్యూ మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్షించారు.


ఈ సమీక్షలో ముఖ్యంగా సదాబైనామా కేసులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు (సదాబైనామా మరియు అసైన్డ్ భూములు మినహా), అసైన్డ్ భూముల వ్యవహారాలు, రీ–సర్వే గ్రామాలలో జీఐఎస్ ఆధారిత డిజిటైజేషన్, భూ భారతి పెండెన్సీ, ఫుల్ షేప్ అలియనేషన్ ప్రతిపాదనలు, మీ సేవా దరఖాస్తుల పెండెన్సీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ప్యాడీ కొనుగోలు పురోగతి, డిఫాల్టర్ రైస్ మిల్లర్లపై ఆర్.ఆర్. చట్టం ప్రకారం తీసుకున్న చర్యలు, ఇసుక నిర్వహణ, తడిబూముల నిర్వహణ, సి.ఏ. భూములు, అటవీ–రెవెన్యూ సంయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సంబంధిత అంశాలు మరియు అటవీ–రెవెన్యూ వివాదాలు గురించి సమీక్షించారు. ఇకపై ఎస్.ఐ.ఆర్. (ఎన్నికలు), జనగణన (Census), కోర్టు కేసులు, జాతీయ రహదారుల భూసేకరణ (Land Acquisition – National Highways) తదితర అంశాల పురోగతిపై సంబంధిత అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు.జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అంశంపై సమయపాలనతో పనిచేసి పెండింగ్ కేసులను తగ్గించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, రెవెన్యూ డివిజనల్ అధికారులు మధు సూదన్, జీవాకర్ రెడ్డి, తహసీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!