సెమికాన్ ఇండియా... కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో సందడి!

సెమీకండక్టర్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతిక ప్రదర్శనలకు వేదిక
న్యూఢిల్లీ: భారత సెమీకండక్టర్ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ ప్రతినిధులు, సంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చారు. “సాంకేతికతతో రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దడం – సిలికాన్ నుంచి సిస్టమ్స్ వరకు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరుగుతోంది. చిప్ డిజైన్, తయారీ, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, మెటీరియల్స్, పరికరాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు.
500కు పైగా సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు, 150 మందికి పైగా స్పీకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్టార్టప్‌లు తమ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తుండటంతో సెమికాన్ ఇండియా ప్రాంగణం కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో సందడిగా మారింది.
కృత్రిమ మేధస్సు, అధునాతన కంప్యూటింగ్, ఆటోమేషన్ వంటి రంగాల విస్తరణతో సెమీకండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారత్ తన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్టార్టప్‌ల మధ్య భాగస్వామ్యాలకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది.
సెమికాన్ ఇండియా 2026 సందర్భంగా కొత్త పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, పరిశోధన, ఆవిష్కరణలకు సంబంధించిన పలు అవకాశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భారత్ పాత్రను మరింత విస్తరించే దిశగా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!