ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను పరామర్శించిన దత్తాత్రేయ

- త్వరగా కోలుకోవాలని మాజీ గవర్నర్ ఆకాంక్ష 



తూఫాన్, హైదరాబాద్ :- ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని తమ నివాసంలో కోలుకుంటున్న ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్‌ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం పరామర్శించారు.

ముషీరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ముఠా గోపాల్ త్వరగా పూర్తి కోలుకుని, తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా దత్తాత్రేయ ఆకాంక్షించారు.




Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!