నాయక్ గురుద్వారా శతాబ్ది వేడుకలకు విశేష స్పందన: గౌలిగూడలో బండారు దత్తాత్రేయ ప్రత్యేక ప్రార్థనలు


హైదరాబాద్‌లోని గౌలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురుద్వారాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వంద సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ శుభసమయంలో ఆయన గురుద్వారా కమిటీకి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, మాజీ కార్పొరేటర్ గొంటి శంకర్ యాదవ్, జి. సద్గుణానంద్ తో పాటు గురుద్వారా కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురుద్వారా ఆధ్యాత్మిక సేవలని, సమాజానికి అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!