తెలంగాణ అమరవీరులకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులు

హైదరాబాద్: హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నాంపల్లిలోని తెలంగాణ శాసనసభ సమీపంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద గురువారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జి. సుభాష్ చందర్‌జీ, మాజీ కార్పొరేటర్ వై. కృష్ణలతో పాటు పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్ర సాధన మరియు విమోచన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. నాటి వీరుల పోరాట ఫలితంగానే నేడు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అనుభవిస్తున్నామని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!