దీర్ఘకాలిక నీటి సరఫరా సమస్యల పరిష్కారానికి వీసీఐ మహిళా విశ్వవిద్యాలయం కీలక చర్యలు

 

తూఫాన్, హైదరాబాద్ :- వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) క్యాంపస్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న నీటి సరఫరా సమస్యల పరిష్కారం కోసం కీలక చర్యలు ప్రారంభించింది. విద్యార్థి వసతి గృహాలు, విద్యా విభాగాలు, ప్రయోగశాలలు మరియు ఇతర విశ్వవిద్యాలయ అవసరాలకు నిరంతర, సమృద్ధిగా నీటి సరఫరా కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ప్రొ. సూర్య ధనంజయ్ మరియు రిజిస్ట్రార్ ప్రొ. గడ్డం మల్లేశం పాల్గొన్నారు. సమావేశంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సామ్రాట్ అశోక్ రోజువారీ నీటి సరఫరా గంటలను పెంచడం, నీటి ఒత్తిడిని (Water Pressure) మెరుగుపరచడం, నీటి సరఫరా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చడం, పైప్‌లైన్‌ను ఆధునీకరించడం వంటి అంశాలపై చర్చించారు.

అనంతరం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్ స్థానంలో అధిక సామర్థ్యం గల పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల విద్యా భవనాలు, వసతి గృహాలు మరియు ఇతర విశ్వవిద్యాలయ విభాగాలకు నిరంతర నీటి సరఫరా అందే అవకాశం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా గౌరవ ఉపకులపతి ప్రొ. సూర్య ధనంజయ్, రిజిస్ట్రార్ ప్రొ. గడ్డం మల్లేశం, ఓఎస్‌డీ ప్రొ. విజయలక్ష్మి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొ. శశికళలు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సామ్రాట్ అశోక్ను ఘనంగా సత్కరించి, ప్రతిపాదిత పనులను అత్యవసరంగా చేపట్టాలని విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు.

విద్యార్థుల సంక్షేమం మరియు విశ్వవిద్యాలయ సమగ్ర అభివృద్ధి దృష్ట్యా రోజువారీ నీటి సరఫరా గంటలను పెంచడం, నీటి ఒత్తిడిని మెరుగుపరచడం, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు హామీ ఇచ్చారు.    



Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!