ఓటర్ల జాబితా ప్రక్షాళనపై బిజెపి దృష్టి: 2వ దశ 'సర్' కార్యశాల ప్రారంభం

- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

- నిశిత పరిశీలన ద్వారా అనుమానాస్పద, అనర్హుల నమోదుల ఏరివేతకు పిలుపు 


హైదరాబాద్ (తూఫాన్ బ్యూరో): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) 2వ దశ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా వేగవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమైంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సర్ 2వ దశ రాష్ట్రస్థాయి కార్యశాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళన, నమోదు ప్రక్రియలపై నాయకులకు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా శ్రేణులు అత్యంత ఉత్సాహంతో పనిచేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. అదే సమయంలో జాబితాలో చోటుచేసుకున్న అనుమానాస్పదమైన, అనర్హమైన లేదా నకిలీ నమోదులను నిశితంగా పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.


పారదర్శకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పక్కాగా ఓటర్ల జాబితా రూపుదిద్దుకోవడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదుతో పాటు, బూత్ స్థాయిలో నిశిత పరిశీలన ద్వారా జాబితాలోని తప్పు ఒప్పులను సరిదిద్దే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాధవనేని రఘునందన్ రావు, గోడం నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, సర్ కన్వీనర్ వేముల అశోక్, ఎన్. గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, పార్టీ రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!