బిర్లా ప్లానిటోరియంలో బాడీ బిల్డింగ్ పోటీలు: విజేతలకు బహుమతుల ప్రదానం

తూఫాన్, హైదరాబాద్ :- నగరంలోని బిర్లా ప్లానిటోరియం హాల్‌లో 'ఆల్ఫా మజిల్ క్లబ్' (AMC) ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు హైదరాబాద్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGOs) అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలని, క్రీడల్లో రాణించడం ద్వారా అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన బాడీ బిల్డర్లకు ఆయన బహుమతులు అందజేసి అభినందించారు.


కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారుడు సంజీవ్ యాదవ్, గుడిసె రూబీ స్టీవెన్ సన్, పిండిగా వెంకన్న, ఆల్ఫా మజిల్ క్లబ్ చైర్మన్ కళ్యాణ్, శివ ప్రసాద్, విశాల్ నాయుడు, వెంకట్, నరేందర్ యాదవ్, విక్రమ్, సాయి యాదవ్, మహేష్, బీరెండర్, శివంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!