Posts

July 4th Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

July 3RD Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

July 2nd Thursday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

July 1st Wednesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

గిరి ప్రదక్షిణ.. గోవింద నామస్మరణ!

Image
రాంపల్లిదాయరలో వైభవంగా శ్రీహేమాద్రి వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ తూఫాన్, కీసర :- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర వెంకులోని గుట్టపై కొలువైన శ్రీహేమాద్రి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం కనులపండువగా సాగింది. నిజ జ్యేష్ట పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణలతో మారుమోగిన గుట్ట గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ అర్చకులు శ్రీహేమాద్రి వెంకటేశ్వర స్వామి వారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల భజనలు, కీర్తనల నడుమ పల్లకి సేవ వైభవంగా ముందుకు సాగింది. భక్తులు 'గోవిందా.. గోవిందా..' అంటూ నామస్మరణలు చేస్తూ స్వామివారి పల్లకి వెంట నడుస్తూ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వి...

కీసరలో వృద్ధురాలిపై దాడి: పుస్తెలతాడు దొంగిలించిన నిందితుడి అరెస్ట్

Image
- చీర్యాల గ్రామంలో ఘోరం.. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తూఫాన్, కీసర :- ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలే లక్ష్యంగా తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి, ఆమె మెడలోని పుస్తెలతాడును తెంచుకెళ్లిన దారుణ ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన సింగిరెడ్డి మల్లమ్మ (75) అనే వృద్ధురాలు ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఉదయం సుమారు 5 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కత్తి అనిల్ కుమార్ పథకం ప్రకారం ఆమె ఇంటి తలుపు తట్టాడు. గుర్తుతెలియని వ్యక్తి ఇంత పొద్దున్నే తలుపు తట్టడంతో ఎవరా అని మల్లమ్మ తలుపు తీసింది. అంతే.. క్షణాల వ్యవధిలో నిందితుడు అనిల్ కుమార్ లోపలికి దూసుకొచ్చి, వృద్ధురాలిపై దాడికి తెగబడ్డాడు. ఆమె గింజుకునేలోపే మెడలోని పుస్తెలతాడును బలవంతంగా తెంచుకుని అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యాడు...

June 30th Tuesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image