Posts

*అంత‌ర్జాతీయ అవార్డును స్వీక‌రించిన మాచ‌ర్ల కుమార‌స్వామినేత‌*

Image
Turn off for: Telugu *అంత‌ర్జాతీయ అవార్డును స్వీక‌రించిన మాచ‌ర్ల కుమార‌స్వామినేత‌*   మ‌లేషియా దేశం కౌలాలాంపూర్ దేశ రాజ‌ధాని సిటీలో ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఎన్‌.ఆర్‌.ఐ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ మ‌లేషియా వారి ఆధ్వ‌ర్యంలో  ఈ నెల 13వ తేదీన కాస్‌మాస్ స్టార్ హోట‌ల్ కౌలాలాంపూర్‌లో మాచ‌ర్ల కుమార‌స్వామి నేత వైస్ ప్రెసిడెంట్‌, తెలంగాణ జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ హైద‌రాబాద్‌, స్టాఫ్ రిపోర్ట‌ర్, మెట్రో ఈవినింగ్ తెలుగు దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్నారు. జ‌ర్న‌లిజం విభాగంలో మాచ‌ర్ల కుమార‌స్వామినేత‌కు *అంత‌ర్జాతీయ ఉగాది కీర్తి ర‌త్న‌* అవార్డును స్వీక‌రించ‌ట‌ము జ‌రిగింది. ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రి స‌మ‌క్షంలో మ‌లేషియా తెలుగు సంఘం, ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఎన్.ఆర్‌.ఐ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్‌ ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. మాచ‌ర్ల కుమార‌స్వామినేత అంత‌ర్జాతీయ అవార్డును స్వీక‌రించిన త‌ర్వాత మాట్లాడుతూ ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రిని ఒక‌తాటిపై తీసుకు వ‌స్తున్న  ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఎన్‌.ఆర్‌.ఐ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ వాళ్ల‌ను అభినందించారు. ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రి స‌హాయ‌స...

మే చివరి వారంలో మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

Image
మే చివరి వారంలో మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'  మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవల తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ''అభిమన్యుడు' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. తమిళ్‌లో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రివ్యూస్...

నగరంలో చేపడుతున్న రోడ్దు నిర్మాణ పనుల్లో రక్షణ ఏర్పాట్ల పై ( సేప్టీ మేజర్ మెంట్స్) మంత్రి సమీక్ష

Image
నగరంలో చేపడుతున్న రోడ్దు నిర్మాణ పనుల్లో రక్షణ ఏర్పాట్ల పై ( సేప్టీ మేజర్ మెంట్స్ ) మంత్రి సమీక్ష వారణాసి నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర ఇంజనీరింగ్ సిబ్బందిని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు . నగరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఎస్సార్ డిపి , ప్రాజెక్టు పనుల్లో భాగంగా అనేక చోట్ల ఫ్లైఓవర్లు మరియు ఇతర నిర్మాణాలు , డబుల్ బెడ్ రూం ఇళ్లు , ఇతర భారీ సివిల్ వర్స్క్ చేపడుతున్న నేపథ్యంలో ఏలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఉదయం మంత్రి జిహెచ్ఎంసి అధికారులకు తెలిపారు . ప్రస్తుతం పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉన్న రక్షణ ఏర్పాట్ల ( సేప్టీ మేజర్ మెంట్స్ ) పైనా పూర్తి స్థాయి సమీక్ష జరపాలని జిహెచ్ఎంసి కమీషనర్ ను మంత్రి కోరారు . దీంతోపాటు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అవసరమైతే   మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు . నిర్మాణ ప్రాంతాల్లో కార్మికుల రక్షణ చర్యలతోపాటు ఆయా ప్రాంతాల నుంచి మీదుగా ప్రయాణించే నగర పౌరులకు అవసర...

వేగంగా సికింద్రాబాద్‌ ఫ్లైఓవ‌ర్‌ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు

Image
Turn off for: Telugu *వేగంగా సికింద్రాబాద్‌ ఫ్లైఓవ‌ర్‌ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు* *న‌గ‌రంలో 10ఫ్లైఓవ‌ర్ల బ్యూటిఫికేష‌న్‌*  గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఫ్లైఓవ‌ర్ల‌ను మ‌రింత ఆక‌ర్ష‌నీయంగా, ఆహ్లాద‌క‌రంగా రూపొందించేందుకు చేప‌ట్టిన ప‌నుల్లో భాగంగా సికింద్రాబాద్ ఫ్లైఓవ‌ర్ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ ఫ్లైఓవ‌ర్‌ను మ‌రింత  ఆక‌ర్ష‌నీయంగా ఉంచేందుకు రంగురంగుల పెయింటింగ్‌ల‌ను వేయించ‌డం, గ్రీన‌రిని ఏర్పాటు చేయ‌డం, ఆక‌ట్టుకునేలా ఉండేలా ఎల్.ఇ.డి లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుగాను దాదాపు కోటిన్న‌ర రూపాయ‌ల‌ను జీహెచ్ఎంసీ ప్ర‌త్యేకంగా కేటాయించింది. సికింద్రాబాద్ ప్యాట్ని సెంట‌ర్ రోడ్డులోని ఫ్లైఓవ‌ర్‌కు రేలింగ్ ఏర్పాటు, మ‌ర‌మ్మ‌తులు, పెయింటింగ్‌ల‌ను చేప‌ట్ట‌డానికి రూ. 1.06కోట్ల వ్య‌యంతో ప‌నులు ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. అదేవిధంగా ఫ్లైఓవ‌ర్ క్రింద రంగురంగుల పూల‌తో కూడిన గార్డెనింగ్, ఫ్లైఓవ‌ర్ పిల్ల‌ర్ల‌కు వ‌ర్టిక‌ల్ గార్డెన్‌ల‌ను రూ. 9ల‌క్ష‌ల వ్య‌యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవ‌ర్‌కు ఆక‌ర్ష‌నీయ‌మైన లైటింగ్ ఏర్పాటు ప‌నులు పురోగ‌తిలో ఉన్నా...

జూన్ 14న విడుదలకు సిద్దమౌతున్న `జంబ‌ల‌కిడి పంబ‌`

Image
జూన్ 14న విడుదలకు సిద్దమౌతున్న `జంబ‌ల‌కిడి పంబ‌`  `జంబ‌ల‌కిడి పంబ‌` అనే పేరు విన‌గానే సీనియ‌ర్ న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో  మ‌రో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్  రూపొందుతోంది. `గీతాంజ‌లి, జ‌య‌మ్మునిశ్చ‌య‌మ్మురా` , ఆనందో బ్రహ్మ వంటి వైవిధ్య‌మున్న చిత్రాల‌తో హీరోగా మెప్పించిన శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. .  శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.  సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. ఈ సినిమా జూన్ 14న విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .  ఈ సంద‌ర్బంగా... చిత్ర నిర్మాత‌లు ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ మాట్లాడుతూ ``మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న `జంబ‌ల‌కిడి పంబ‌`తో ప్రేక్ష‌కులు మ‌రోసారి లాఫింగ్ రైడ్ చేయ‌నున్నారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. నేటి...

జూన్ 5 నుండి నిర్మాణ వ్య‌ర్థాల‌ను త‌ర‌లించే అక్ర‌మ వాహ‌నాల‌పై బ‌ల్దియా ఉక్కుపాదం

Image
Turn off for: Telugu *జూన్ 5 నుండి నిర్మాణ వ్య‌ర్థాల‌ను త‌ర‌లించే అక్ర‌మ వాహ‌నాల‌పై బ‌ల్దియా ఉక్కుపాదం* *జూన్ 5లోపు నిర్మాణ వ్య‌ర్థాల‌ను త‌ర‌లించే వాహ‌నాలు రిజిస్ట‌ర్‌ చేసుకోవాలి - మేయ‌ర్ రామ్మోహ‌న్‌*   గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో జూన్ 5వ తేదీ నుండి భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను ఎంపిక చేసిన ప్ర‌దేశాల్లో కాకుండా నాలాలు, చెరువులు, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వేసే అక్ర‌మ వాహ‌నాల‌పై ఉక్కుపాదం మోపాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల త‌ర‌లింపు పై న‌గ‌రంలోని ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లైన క్రేడాయి, ట్రేడాయి, ఇత‌ర నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో నేడు ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, చీఫ్ సిటీ ప్లాన‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్ త‌దిత‌ర అధికారులు పాల్గొన్న ఈ స‌మావేశంలో మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ న‌గ‌రంలోని బిల్డ‌ర్లు త‌మ ప్రాజెక్ట్‌ల నుండి నిర్మాణ వ్య‌ర్థాల‌ను త‌ర‌లించే ర‌వాణా వాహ‌నాల‌న్నింటిని ...

145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ

Image
145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య  శాఖ  తెలంగాణ అవిర్భావం తర్వాత వైద్య శాఖ ను బలోపేతమ్ చేస్తున్నామ‌ని వైద్య ఆరోగ్య  శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను మంత్రి లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..... మొబైల్ వైద్య సేవలను కూడా మరింత మెరుగు పరచామని చెప్పారు. ఎమర్జెన్సీ 108, అమ్మ ఒడి 102, పార్థివ వాహనాలు, రెక్కలు, 108 బైక్ వాహనాలు ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. ఆయా వాహనాలలో పని చేసే సిబ్బందికి తగిన శిక్షణ జూడా ఇచ్చామ‌న్నారు. ఎమర్జెన్సీ 108 వాహనాలు 316 పని చేస్తున్నాయ‌ని, అందులో 145 పాత వాహనాలను తొలగించి 145 కొత్త వాహనాలను ప్రారంభించామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనలతో వైద్య శాఖ అభివృద్ధి పథంలో నడుస్తున్నది వెల్ల‌డించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాలను ఆధునికరించామ‌న్నారు. రాష్ట్రంలో అమ్మ ఒడి 102 వాహనాలు అద్భుత సేవలు అందిస్తున్నామ‌ని,  గర్భిణీలు, బాలింతలను వారి ఇళ్లక...