145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ
145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ
తెలంగాణ అవిర్భావం తర్వాత వైద్య శాఖ ను బలోపేతమ్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..... మొబైల్ వైద్య సేవలను కూడా మరింత మెరుగు పరచామని చెప్పారు. ఎమర్జెన్సీ 108, అమ్మ ఒడి 102, పార్థివ వాహనాలు, రెక్కలు, 108 బైక్ వాహనాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా వాహనాలలో పని చేసే సిబ్బందికి తగిన శిక్షణ జూడా ఇచ్చామన్నారు. ఎమర్జెన్సీ 108 వాహనాలు 316 పని చేస్తున్నాయని, అందులో 145 పాత వాహనాలను తొలగించి 145 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనలతో వైద్య శాఖ అభివృద్ధి పథంలో నడుస్తున్నది వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాలను ఆధునికరించామన్నారు. రాష్ట్రంలో అమ్మ ఒడి 102 వాహనాలు అద్భుత సేవలు అందిస్తున్నామని, గర్భిణీలు, బాలింతలను వారి ఇళ్లకు చేర్చడంలో 102 వాహనాలు బాగా పని చేస్తున్నాయి చెప్పారు. 108 సేవలు కూడా బాగున్నాయి మారుమూల గల్లీల్లో కి వెళ్ళడానికి వీలుగా 108 బైక్ అంబులెన్స్ వాహనాలు ఉపయోగపడుయున్నాయని అన్నారు. నర్సెస్ కి రెక్కల వాహనాలను అందించి మొబైల్ సేవలను విస్తృతంపరుస్తున్నామని, 50 పార్థివ వాహనాల ద్వారా డెడ్ బాడీలను ఇళ్లకు చేరుస్తున్నామని తెలియజేశారు. మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ....రాష్ట్రానికి కేంద్ర సహకారం పూర్తిగా ఉన్నదని, ఎయిమ్స్ ని తెలంగాణలో ప్రారంభించడానికి కేంద్రం చర్యలు వేగవంతం చేసిందని తెలిపారు. హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి కామెంట్స్ సీఎం కేసీఆర్ సూచనలతో, మంత్రి లక్ష్మారెడ్డి బాగా పని చేస్తున్నారని, వైద్యశాఖ పనితీరు బాగా మెరుగు పడిందని, కంటి పరీక్షలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ చేస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.... కేసీఆర్ సీఎం అయ్యాక హెల్త్ శాఖ మంచిగా పని చేస్తున్నదని, ఇప్పుడు సర్కార్ దవాఖానాలకే ప్రజలు వచ్చేలా, ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, జీవీకే ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments
Post a Comment