*అంతర్జాతీయ అవార్డును స్వీకరించిన మాచర్ల కుమారస్వామినేత*
Turn off for: Telugu
*అంతర్జాతీయ అవార్డును స్వీకరించిన మాచర్ల కుమారస్వామినేత*
మలేషియా దేశం కౌలాలాంపూర్ దేశ రాజధాని సిటీలో ఫెడరేషన్ ఆఫ్ ఎన్.ఆర్.ఐ కల్చరల్ అసోసియేషన్ మలేషియా వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కాస్‌మాస్ స్టార్ హోటల్ కౌలాలాంపూర్‌లో మాచర్ల కుమారస్వామి నేత వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ హైదరాబాద్, స్టాఫ్ రిపోర్టర్, మెట్రో ఈవినింగ్ తెలుగు దిన పత్రికలో పనిచేస్తున్నారు. జర్నలిజం విభాగంలో మాచర్ల కుమారస్వామినేతకు *అంతర్జాతీయ ఉగాది కీర్తి రత్న* అవార్డును స్వీకరించటము జరిగింది. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరి సమక్షంలో మలేషియా తెలుగు సంఘం, ఫెడరేషన్ ఆఫ్ ఎన్.ఆర్.ఐ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాచర్ల కుమారస్వామినేత అంతర్జాతీయ అవార్డును స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరిని ఒకతాటిపై తీసుకు వస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఎన్.ఆర్.ఐ కల్చరల్ అసోసియేషన్ వాళ్లను అభినందించారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరి సహాయసహకారములతో సామాజిక తెలంగాణ సాధించాలని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ అవార్డును స్వీకరించినందుకు కుటుంబ సభ్యులు, బందు మిత్రులు, మెట్రో ఈవీనింగ్ మేనేజ్‌మెంట్, స్టాఫ్ హర్షం వ్యక్తం చేసినారు.

Comments
Post a Comment