మహిళా చైతన్యం వర్ధిల్లాలి.. రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు
- 1908 నాటి పోరాటమే మహిళా దినోత్సవానికి పునాది - జై మహాభారత పార్టీ ఆధ్వర్యంలో మహిళామణులకు సత్కారం తూఫాన్,హైదరాబాద్ :- మహిళల హక్కులు, సమానత్వం కోసం జరిగిన పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని భగవాన్ అనంత విష్ణుదేవప్రభు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. చారిత్రక నేపథ్యంపై విశ్లేషణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1908లో న్యూయార్క్‌లో పనిగంటలు, సరైన వేతనం కోసం వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికులు చేపట్టిన నిరసన ప్రపంచవ్యాప్త మహిళా చైతన్యానికి నాంది పలికిందన్నారు. దీనిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. కుటుంబ వ్యవస్థకు మహిళే ఆధారం కుటుంబ వ్యవస్థలో, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని, వారికి తగిన గౌరవం ...