సివిల్స్ ఫలితాల్లో లా ఎక్సలెన్స్ విద్యార్థుల ఘనవిజయం

- టాప్ 100లో 12 ర్యాంకులు.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల హవా 


తూఫాన్,హైదరాబాద్ :- యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ 2025-26 ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అకాడమీకి చెందిన అభ్యర్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టాప్ 100లో 12 ర్యాంకులతో సహా మొత్తం 85 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి 23, 53, 55, 178, 193, 409, 463, 472, 492 వంటి మెరుగైన ర్యాంకులు సాధించిన వారు లా ఎక్సలెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన వారే కావడం విశేషం. ఫలితాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని అకాడమీ ప్రతినిధులు తెలిపారు.

దక్షిణ భారతంలో అగ్రగామిగా.. గత కొన్నేళ్లుగా స్థిరమైన ఫలితాలు సాధిస్తూ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్ సంస్థగా ఎదిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా అకాడమీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే డిగ్రీ ప్లస్ ఐఏఎస్‌తో పాటు ఇంటర్ జీఈ (JEE), నీట్ (NEET), ఇంటర్ ప్లస్ ఐఏఎస్, క్లాట్ (CLAT), జీమ్యాట్ (GMAT) వంటి కోర్సులను కూడా అందిస్తోంది.

కొత్త క్యాంపస్‌ల ఏర్పాటు విద్యార్థులకు మరింత చేరువయ్యేందుకు హైదరాబాద్ నగరంలోని ఆదిబట్ల, కొంపల్లి ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో కూడిన నూతన విద్యా సంస్థలను అకాడమీ ఏర్పాటు చేసింది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు లా ఎక్సలెన్స్ సరైన వేదికగా నిలుస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం అకాడమీని సంప్రదించాలని యాజమాన్యం సూచించింది.





Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!