సివిల్స్ ఫలితాల్లో ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ హవా
- 60కి పైగా ర్యాంకులతో అభ్యర్థుల ఘనవిజయం
- ఫ్యాకల్టీ సహకారం, ఇంటర్వ్యూ గైడెన్స్ భేష్: ర్యాంకర్ల వెల్లడి
తూఫాన్, హైదరాబాద్ :- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ విద్యా సంవత్సరం తమ సంస్థ నుంచి 60కి పైగా ర్యాంకులు లభించినట్లు స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర తెలిపారు. హిమాయత్ నగర్‌లోని స్టడీ సర్కిల్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ర్యాంకర్లతో కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా 259వ ర్యాంకర్ వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మూడో ప్రయత్నంలో తనకు ఈ విజయం దక్కిందని వివరించారు. ప్రస్తుతం జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తాను, సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కృషి చేశానన్నారు. తనలోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవడంలో ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ ఎంతగానో తోడ్పడిందని కృతజ్ఞతలు తెలిపారు.
మరో ర్యాంకర్ కుమ్మరి శ్రవణ్ కుమార్ (768వ ర్యాంకు) మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఫ్యాకల్టీ గైడెన్స్ వల్లనే ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటర్వ్యూ దశలో ఇక్కడ అందించిన శిక్షణ, అవగాహన సదస్సులు తన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని వివరించారు. తమ సంస్థ నుంచి మరిన్ని ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని, విజేతలకు అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర అభినందనలు తెలియజేశారు.



Comments
Post a Comment