మహిళల సాధికారతతోనే దేశాభివృద్ధి.. బాగ్‌లింగంపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు

- బండారు వైష్ణవ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారాలు

- ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ


తూఫాన్, హైదరాబాద్ :- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అన్ని రంగాల్లో వారు సాధిస్తున్న పురోగతి గర్వకారణమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బండారు వైష్ణవ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బండారు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళామణులను ఘనంగా సత్కరించారు.

ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే దేశం మరింత వేగంగా అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. నేడు మహిళలు పురుషులతో సమానంగా శాస్త్ర సాంకేతిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. వారి విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.


కార్యక్రమంలో న్యాయమూర్తి మాధవిలత, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, ఇఫ్లూ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ సునైనా సింగ్, రమాదేవి, టీవీ9 ప్రతినిధి దీప్తి వాజపేయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన పలువురు మహిళా ప్రతిభావంతులను ఫౌండేషన్ తరపున మెమెంటోలు, శాలువాలతో గౌరవించారు. మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!