Posts

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

Image
  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి   హైదరాబాద్, జూలై 04(TOOFAN):    తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. దొడ్డి కొమురయ్య 79వ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి, విముక్తి కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాటం మరువలేనిది అని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ లు అనురాగ్ జయంతి, రఘు ప్రసాద్, గీతా రాధిక, వేణుగోపాల్, సి.ఈ రత్నాకర్, చీఫ్ అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

July 4th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

పైరసీపై కఠిన చర్యలు

Image
  👉 ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు 👉 సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి - ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్, జూలై 3, (TOOFAN): సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫడిసి బోర్డు రూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించామని, సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన కూడా చేస్తామని అయన వెల్లడించారు. ఎఫ్‌డీసీ నోడల్ ఏజెన్సీగా , ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్‌లకు ఆన్లైన్ అనుమతుల ప్రొసెస్‌తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని దిల్ రాజు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్...

క్లోజ్ అయిన గనులను పునరుపయోగానికి మార్గం – కిషన్ రెడ్డి

Image
బొగ్గు గనుల మూసివేత అనంతరం  వృక్షసంపద అభివృద్ధికి చర్యలు  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్ శివార్లలోని కాన్హా శాంతివనంలో బొగ్గు, గనుల  శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను అధికారులు వెల్లడించగా.. ఇకపై చేపట్టాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు.  మైనింగ్ కు సంబంధించిన పలు అంశాలను కూడా లెవనెత్తారు. వీటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అధికారులు సమాధానం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చొరవతీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను సభ్యులందరూ ప్రశంసించారు. మైన్ క్లోజర్ సందర్భంగా.. మైనింగ్ కోసం భూములిచ్చి ఉద్యోగాలు పొందిన వారికి మళ్లీ ఉపాధి కల్పించడం, తదితర అంశాలను సభ్యులు లేవనెత్తారు. దీనిపై దృష్టిసారిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటుగా, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కిషన...

వాహనాల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి: కమీషనర్ ఆర్వీ కర్ణన్

Image
  వాహనాల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి: కమీషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్, జులై 03(TOOFAN):    వాహనాల మరమ్మత్తుల షెడ్ పరిశుభ్రంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.  గురువారం ఆయన కవడిగూడ వాహనాల మరమ్మతు షెడ్ ను పరిశీలించి వాహనాల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఖైరతాబాద్ వాహన పార్కింగ్ షెడ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ వాహనాలను రిపేర్ చేసి వాడుకలోకి తేవాలన్నారు. అవసరమైన సమయంలో వాడుకునేందుకు తగిన చర్యలు  https://toofandailytelugu.blogspot.com/2025/07/july-3rd-thursday-2025-toofan-telugu.html తీసుకోవాలన్నారు.  కమీషనర్ వెంట అడిషనల్ కమీషనర్ ట్రాన్స్ పోర్ట్ రఘు ప్రసాద్, జోనల్ కమీషనర్ రవి కిరణ్, జూబ్లీహిల్స్ సర్కిల్ 18 ఈఈ  విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

July 3rd, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
   

July 2nd, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image