వాహనాల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి: కమీషనర్ ఆర్వీ కర్ణన్
వాహనాల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి: కమీషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్, జులై 03(TOOFAN): వాహనాల మరమ్మత్తుల షెడ్ పరిశుభ్రంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన కవడిగూడ వాహనాల మరమ్మతు షెడ్ ను పరిశీలించి వాహనాల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఖైరతాబాద్ వాహన పార్కింగ్ షెడ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ వాహనాలను రిపేర్ చేసి వాడుకలోకి తేవాలన్నారు. అవసరమైన సమయంలో వాడుకునేందుకు తగిన చర్యలు https://toofandailytelugu.blogspot.com/2025/07/july-3rd-thursday-2025-toofan-telugu.html తీసుకోవాలన్నారు. కమీషనర్ వెంట అడిషనల్ కమీషనర్ ట్రాన్స్ పోర్ట్ రఘు ప్రసాద్, జోనల్ కమీషనర్ రవి కిరణ్, జూబ్లీహిల్స్ సర్కిల్ 18 ఈఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment