Posts

Natural Star Nani’s voiceover for Ee Maaya Peremito

Natural Star Nani’s voiceover for Ee Maaya Peremito

యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా

Image
         యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా  సికింద్రాబాద్ మండలం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా నిర్వహించ బడుచున్నది ఇందులో 10 వ తరగతి పాస్/ఫెయిల్ , ఐ,టీ.ఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, (బీఎస్సీ, ఎమ్మెస్సీ, లైఫ్సైన్సెస్, ఫార్మసీ) యం.బీ.ఏ, బి.టెక్, ఎం.సి.ఏ, డిప్లొమా అర్హత కలిగిన 18-35 సంIIల వయస్సు గల వారు హాజరు కాగలరు, ఈ జాబ్ మేళా తేది.27.06.2018  రోజున  సికింద్రాబాద్  జోన్ పరిధి లోని హరి హారా కలా భవన్ లొ ఉదయం 9.00 AM నుండి 5.00 PM వరకు నిర్వహించబడును.  అభ్యర్ధులకు అవగాహన మరియు అభ్యర్ధి రిజిస్ట్రేషన్ మరియు అర్గనైజర్స్ పరిచయాలు ఉంటాయి,  రిజిస్ట్రేషన్ ఐన అభ్యర్దులకి H.R. లతో ఇంటర్వ్యూ జరిపి అభ్యర్ధికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడును.  ఇందులో దాదాపు ముపై పైగా సంస్థలు వారి H.R.లు పాల్గొంటారు. కాబట్టి ఆస‌క్తి కలిగిన, పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్ధులు Xerox కాపీలు మరియు 5 సెట్ల C.V. లతో హాజరు కాగలరని కోరడమైనది. నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా...

రూ. 450 కోట్ల వ్య‌యంతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ది

Image
రూ. 450 కోట్ల వ్య‌యంతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ది హెచ్‌.ఆర్‌.డిలో ప్రారంభ‌మైన స్వ‌చ్ఛ ఐకానిక్ జాతీయ స‌ద‌స్సు    దేశంలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క‌, చారిత్ర‌క‌, ఆధ్యాత్మిక కేంద్రాల‌ను స్వ‌చ్ఛ ఐకానిక్ ప్లేసెస్‌లుగా గుర్తించి వాటిని రూ. 450 కోట్ల వ్య‌యంతో ప‌ర్యాట‌క అనుకూల ప్రాంతాలుగా అభివృద్ది చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ డ్రింకింగ్ వాట‌ర్‌, సానిటేష‌న్ శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ అక్ష‌య్ రౌత్‌ వెల్ల‌డించారు. హైద‌రాబాద్ మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల సంస్థ‌లో స్వ‌చ్ఛ ఐకానిక్ ప్లేసెస్‌ అనే అంశంపై జ‌రిగిన జాతీయ స్థాయి స‌ద‌స్సును జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో క‌లిసి అక్ష‌య్ రౌత్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల నుండి వ‌చ్చిన సీనియ‌ర్ అధికారులు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ క్రింద చేప‌ట్టిన ప‌లు కార్పొరేట్ సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి, స్వ‌చ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ అక్ష‌య్ రౌత్ మాట్లాడుతూ మొత్తం మూడు ద‌శ‌ల్లో 30 ప్ర‌ముఖ ప‌ర్యాట‌క, చారిత్ర‌క‌, ఆధ్యా...

తండ్రి టి.కృష్ణ భావాల‌ను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ : మంత్రి దేవినేని

Image
తండ్రి టి.కృష్ణ భావాల‌ను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ :మంత్రి దేవినేని   ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై అభిరుచి గల నిర్మాత కె.కె. రాధామోహన్‌ 'పంతం' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మిస్తున్నారు. హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జూన్‌ 21న జరిగింది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పంతం' చిత్రం జూలై 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మినిస్ట‌ర్ దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ఎఫ్‌.డి.సి.చైర్మన్‌ అంబికా కృష్ణ, దేవినేని అవినాశ్‌, దేవినేని చందు, ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, గోపీచంద్‌ మలినేని, రత్నకుమార్‌, భాస్కర భట్ల, సంపత్‌ నంది, బాబీ,...

ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు...సై అంటున్న రాజ‌కీయ వార‌సులు

Image
ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు...సై అంటున్న రాజ‌కీయ వార‌సులు పేరుకే రాజులు....రాజ్యాలు క‌నుమ‌రుగైపోయాయి. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అని చెబుతున్నా.... బ‌డా నేత‌ల వంశాలు.. వారి సంతానాలు మాత్ర‌మే ఇప్ప‌టికీ రాజ్యాధికారం చేప‌డుతూ ఉన్నాయి. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనేక మంది బ‌డా నేత‌ల పిల్ల‌లు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌న‌న్నారు. ఎన్నిక‌ల జ‌ర‌గ‌డానికి సంవ‌త్స‌రం ముందు నుంచే రాజ‌కీయ వార‌స‌లు త‌మ స‌త్తాను చాటుకునేందుకు అనేక ర‌కాలుగా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు వారిని ఆక‌ర్షించి ఆక‌ట్టుకునేందుకు అన్ని ర‌కాలుగా దూసుకుపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాజ‌కీయ వార‌సులు ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు త‌మ అమ్ములో పొదిలో ఉన్న ఆస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటూ ఎన్నిక‌ల వేడిని ర‌గిలిస్తున్నారు.  ష‌రాప‌రంప‌రాలా మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యపదవుల్లో ఉన్న అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంత ...

నాడొక మురికి కుంట‌...నేడు అది అంద‌మైన ఉద్యాన‌వ‌నం

Image
*నాడొక మురికి కుంట‌...నేడు అది అంద‌మైన ఉద్యాన‌వ‌నం* *రూ. 6.20కోట్ల‌తో కిష‌న్‌బాగ్ పార్కు నిర్మాణం* *ప్రారంభించ‌నున్న మంత్రి కె.టి.ఆర్‌*     నాడు అదో మురికి కుంట‌...నిత్యం దుర్గందం, పిచ్చి మొక్క‌ల‌తో పందులు, ఇత‌ర జంతువుల‌తో ఉన్న ప్రాంతం...నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ కిష‌న్‌బాగ్‌ కుంట‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ నేడు అంద‌మైన పార్కుగా రూపొందించింది. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో మ‌రిన్ని పార్కులు ఏర్పాటు చేయ‌డం ద్వారా గ్రీన‌రిని పెంచేందుకు చేప‌ట్టిన ప్ర‌త్యేక చ‌ర్య‌లో భాగంగా ఖాళీగా ఉన్న స్థ‌లాల్లో పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రాధాన్య‌త‌ను ఇస్తోంది. దీనిలో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండి మురుగునీరు, పిచ్చి చెట్ల‌తో నిండి ఉండి ప‌రిస‌ర ప్రాంతాలు దుర్గందం, దుర్వాస‌న‌, దోమ‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ స‌మ‌స్యకు శాశ్వ‌త ప‌రిష్కారంతో పాటు పాత‌బ‌స్తీ వాసుల‌కు సుంద‌ర‌మైన ఉద్యాన‌వ‌నాన్ని నిర్మించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఇందుకుగాను రూ. 6.20 కోట్ల‌ను మంజూరు చేసింది. దీంతో రూ. 5.45 కోట్ల‌తో సివిల్ ప‌నులు, రూ. 35 ల‌క్ష‌ల‌తో గ్రీన‌రి, మొక్క‌లు ...

తెలంగాణకు హరితహారం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటి

Image
• తెలంగాణకు హరితహారం, జాతీయ రహదారుల భూసేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ డా.ఎస్.కె జోషి వీడియో కాన్ఫరెన్స్. • నాలుగో విడత హరితహారం జులై రెండో వారంలో ప్రారంభానికి సన్నాహాలు  • మెరుగైన ఫలితాల కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సిబ్బందికి రెండు రోజుల చొప్పున శిక్షణ ముందస్తు చర్యలు పకడ్భందీగా ఉండాలి • మొక్కలు, నాటే ప్రాంతాల ఎంపిక, పిట్స్ తవ్వకం పూర్తి చేయాలి తెలంగాణకు హరితహారం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో ఒకటని, ఏమాత్రం పొరపాట్లు జరగకుండా నాలుగో విడత హరితహారం కోసం సన్నద్దం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలకు చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి పిలుపు నిచ్చారు. ఈయేడాది హరితహారంలో 39 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని నిర్ణయించామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపులో కొన్ని జిల్లాలు వెనుకపడ్డాయని తక్షణం ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రాంతాల గుర్తింపు, ముందుస్తుగా పిట్స్ తవ్వకం, రక్షణా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సారి హరితహారంలో స్కూలు పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని, వారినే ప...