ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు...సై అంటున్న రాజ‌కీయ వార‌సులు




ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు...సై అంటున్న రాజ‌కీయ వార‌సులు



పేరుకే రాజులు....రాజ్యాలు క‌నుమ‌రుగైపోయాయి. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అని చెబుతున్నా.... బ‌డా నేత‌ల వంశాలు.. వారి సంతానాలు మాత్ర‌మే ఇప్ప‌టికీ రాజ్యాధికారం చేప‌డుతూ ఉన్నాయి. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనేక మంది బ‌డా నేత‌ల పిల్ల‌లు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌న‌న్నారు. ఎన్నిక‌ల జ‌ర‌గ‌డానికి సంవ‌త్స‌రం ముందు నుంచే రాజ‌కీయ వార‌స‌లు త‌మ స‌త్తాను చాటుకునేందుకు అనేక ర‌కాలుగా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు వారిని ఆక‌ర్షించి ఆక‌ట్టుకునేందుకు అన్ని ర‌కాలుగా దూసుకుపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాజ‌కీయ వార‌సులు ఎన్నికల క్షేత్రంలో పోరాడేంద‌కు త‌మ అమ్ములో పొదిలో ఉన్న ఆస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటూ ఎన్నిక‌ల వేడిని ర‌గిలిస్తున్నారు. 




ష‌రాప‌రంప‌రాలా మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యపదవుల్లో ఉన్న అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంత వరకు అవగాహనకు రాలేకపోతున్నారు. టిడిపి అవలీలగా విజయం సాధించే నియోజకవర్గాల్లో ఆయా నాయకుల వారసులు కన్నేశారు. అటువంటి వారుసులు కొందరిపై చంద్రబాబు కుమారుడు లోకేష్‌ దృష్టిసారించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేయాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. వారసులు నిన్నటి వరకు తెరవెనుక ఉండి..అక్రమాలకు పాల్పడి కోట్లు వెనకేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ మంది అక్రమార్జన విషయంలో విమర్శలు కొని తెచ్చుకున్నారు...అధినేత చంద్రబాబు మందలింపులకు కూడా గురయ్యారు. 

గంటా త‌న‌యుడు


మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కుమారుడిని రాజకీయాల్లోకి తెస్తారా..? లేదా అన్న విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచుతున్నారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన పెద్ద కుమార్తెను కాకినాడ రూరల్‌ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే...ఆయన కుమార్తె...కాకినాడలో అప్పుడప్పుడు హడావుడి చేయడమే కాకుండా...రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేను తానేని ప్రచారం చేసుకుంటున్నారట. ఇదే విధంగా వైకాపా ఎమ్మెల్యేగా విజయం సాధించి టిడిపిలో చేరిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన కుమారుడ్ని ఇప్పటికే జడ్పీ ఛైర్మన్‌ను చేశారు..భవిష్యత్‌లో ఎమ్మెల్యేను చేయాలని ఆరాటపడు తున్నారు. దివంగత బాలయోగి వారసుడిని రాజకీయాల్లో తీసుకువచ్చేందుకు 'చంద్రబాబు' ప్రయత్నాలు చేస్తున్నారు. బాలయోగి కుమారుడ్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలా..? లేక ఎంపీగా పోటీ చేయించాలా..? అనే దానిపై ఆయన తుది నిర్ణయం తీసుకోలేదు. సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తన వారసుడిగా ఎవరినైనా ప్రతిపాదించబోతున్నారా..? అనే విషయం బయటపడడం లేదు. ఇప్పటికే భవిష్యత్‌ ఎన్నికల్లో తాను పోటీ చేయనని 'బుచ్చయ్య' బాహాటంగా ప్రకటించారు. 

రాయ‌పాటి రాజ‌కీయ వార‌సుడు


అదే విధంగా నర్సరావుపేట ఎంపిగా 2014లో విజయం సాధించిన 'రాయపాటి సాంబశివరావు' తాను పోటీ చేయనని, తన కుమారుడు రాజకీయవారసుడిగా రంగ ప్రవేశం చేస్తారని ప్రకటించారు. కానీ..మళ్లీ తానే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. రాయపాటి రంగారావుకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తానని అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు హామీ ఇచ్చినట్లు... జిల్లా టీడీపీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతుంది.రాయపాటి సాంబశివరావులానే..ఆయన కుమారుడు  రంగారావుకు కూడా కార్యకర్తల్లో, ఇతర ముఖ్యుల్లో మంచిపేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.అంతే కాక రాయపాటి వారసుడు...రంగారావు ...నారా లోకేష్ మరియు చంద్రబాబులతో మంచి సత్సంభందాలను కొనసాగిస్తూ...తన సామాజిక వర్గంలోనే కాక మిగిలిన సామాజిక వర్గాల ప్రజలలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు... తెలుగు దేశం అధినేత...చంద్రబాబుని విమర్శిస్తున్న జగన్ ,బీజేపీ నాయకులకు..పదునైన కౌంటర్లు ఇస్తూ టీడీపీ అధినాయకత్వానికి  బాగా దగ్గరయ్యారు...అలానే రంగారావు పార్టీకి,..ప్రజలకు..చేస్తున్న సేవలను గుర్తించి..టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి అప్పగించారు..    మెడికల్ క్యాంపులు,పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం...ఇలా తాను చేస్తున్న మంచి పనులతో కూడా ప్రజల్లో బాగా నానుతూ.. తనదయిన రాజకీయ ముద్రతో ముందుకు సాగుతూ...2019 ఎలెక్షన్స్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

కోడెల త‌న‌యుడు కూడా...


ఇక నర్సరావుపేట, సత్తెనపల్లిలో పెత్తనం చేస్తోన్న స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఏదో ఒకదానిలో తానుపోటీ చేసి..రెండో నియోజకవర్గంలో తన కుమారుడు అయిన డాక్టర్‌ కోడెల శివరామ్‌ప్రసాద్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. రాజకీయాల్లో తండ్రిలా చురుకైన పాత్ర పోషించడంలో 'శివరామ్‌' వెనుకబడ్డప్పటికీ 'కోడెల' చంద్రబాబును కోరితే...ఆయన కుమారునికి టిక్కెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. కానీ..కోడెల ఈ కోరికను కోరతారా..? అనే విషయంపై ఆయన అంతరంగం బయటపడడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే..ప్రస్తుత సీనియర్‌ ఎమ్మెల్యేల్లో కొందరు తమ వారుసులను రంగంలోకి దించడానికి సిద్ధమయ్యారు. కానీ..అటువంటి ప్రతిపాదన లేకపోవడంతో...మరికొద్ది కాలం ఎదురుచూపులు వారికి మిగిలాయి. 

ఈ విధంగా అనేక జిల్లాలోని టిడిపి ముఖ్యనాయకుల వారసులు..ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే..ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు కుమారుడు 'లోకేష్‌' దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరెవరికి పోటీ చేసే అవకాశం 'చంద్రబాబు' ఇస్తారో కానీ..వారసులు హడావుడి పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి