Posts

అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెల్లోస్ ' టైటిల్ లాంచ్

Image
అల్లరి నరేష్, సునీల్ 'సిల్లీ ఫెల్లోస్ ' టైటిల్ లాంచ్  బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3 గా వస్తున్న చిత్రం "సిల్లీ ఫెల్లోస్". అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తుండగా..  కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది..  ఈ సందర్భంగా  దర్శకుడు భీమినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..."అల్లరి నరేష్ తో నేను తీసిన "సుడిగాడు" పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ మా కాంబినేషన్ "సిల్లి ఫెల్లోస్"తో రిపేట్ అవుతుండడం ఆనందంగా ఉంది. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్సపెక్ట్ చేశారో అదే ఈ సినిమాలో ఉంటుంది. హీరోలు అని కాకుండా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేశారు ఇద్దరూ. ఇంత మంచి నిర్మాతలను ఇచ్చిన వివేక్ గారికి నా కృతఙ్ఞతలు. బ్లూ ప్లానెట్ లో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకు...

'దేశంలో దొంగలు ప‌డ్డారు' టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

Image
'దేశంలో దొంగలు ప‌డ్డారు' టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మా గౌత‌మ్ నిర్మిస్తున్న చిత్రం 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'. ఈ సినిమా టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ " టీజర్ చాలా నచ్చింది. చూడగానే ఇంప్రెస్ అయ్యాను. టైటిల్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ " అని అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రాజ్ కుమార్  మాట్లాడుతూ " ముందుగా మా టీజర్ ను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన పూరి గారి ధన్యవాదాలు తెపుకుంటున్నా. సినిమా షూటింగ్ పూర్త‌యింది. వైజాగ్, సీలేరు, చింత‌ప‌ల్లి,  డొంక‌రాయ‌, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్ర‌దేశాల్లో షూటింగ్ చేసాం. ఇప్ప‌టివ‌ర‌కూ ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఎవ్వ‌రూ చేయ‌ని లోకేష‌న్ల‌లో షూటింగ్ చేసాం. ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్ స్టోరీ. హ్యామన్ ట్రాఫికింగ్ అం...

*చార్మినార్‌లో అక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించిన క‌మిష‌న‌ర్*

Image
*చార్మినార్‌లో అక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించిన క‌మిష‌న‌ర్*    రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని చారిత్ర‌క మ‌క్కా మ‌జీద్‌, చార్మినార్ ప్రాంతాల్లో చేప‌ట్టిన‌ పారిశుధ్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ పై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జనార్థ‌న్‌రెడ్డి నేడు ఉద‌యం అక‌స్మికంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. రంజాన్ సంద‌ర్భంగా మ‌క్కా మ‌జీద్‌, చార్మినార్ ప్రాంతాల్లో వేలాది మంది ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ ప్ర‌త్యేక పారిశుద్య కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. నేడు ఉద‌యం దాదాపు రెండు గంట‌ల పాటు చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ముఖ్యంగా ప్రార్థ‌న‌ల నిర్వ‌హ‌ణ ర‌హ‌దారుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డం, రోడ్ల‌కు ఇరువైపులా ఏ విధ‌మైన వ్య‌ర్థాలు, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు లేకుండా చూడ‌డం, ర‌హ‌దారుల‌కు అవ‌స‌ర‌మైతే మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించ‌డంతో పాటు చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని షీ-టాయిలెట్లు, ఇత‌ర టాయిలెట్ల నిర్వ‌హ‌ణ తదిత‌ర అంశాల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. చార్మినార్ జోన్ క‌మిష‌న‌ర్ ఎన్‌.ర‌వికిర‌ణ్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్ అశోక్ సామ్రాట్‌, ఇంజ‌నీరింగ్ అధికారులతో...

గ్రామీణ డాక్ సేవకుల భారీ నిరసన.. దిగివచ్చిన అధికారులు

Image
గ్రామీణ డాక్ సేవకుల భారీ నిరసన.. దిగివచ్చిన గ్రామీణ డాక్ సేవకుల భారీ నిరసన.. దిగివచ్చిన అధికారులు  భారత తపాలా శాఖకు చెందిన మూడు లక్షల మంది గ్రామీణ్ డాక్ సేవక్ లు దేశవ్యాప్తంగా గత పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో దేశంలోని లక్షా యాబై ఐదు వేల పోస్టాఫీసుల్లో లక్షా ముప్పై వేల పోస్టాఫీసులు మూతపడ్డాయి. నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగ భద్రత కోసమో, పని పరిస్థితుల మెరుగుదల కోసమో, సమాన పనికి సమాన వేతనం కోరుతూనో కూడ కాదు, కేవలం కమలేష్ చంద్ర కమిటీ నివేదికను పద్దెనిమిది నెలల తర్వాత అయినా బైటపెట్టమని, ఆ కమిటీ సిఫారసు చేసినట్టుగా తమ వేతనాలు పెంచమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు చెందిన గ్రామీణ్ డాక్ సేవక్ లు ఇవాళ తమ సమ్మె పద్నాలుగో రోజు సందర్భంగా హైదరాబాద్ లోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి వచ్చి తమ సమస్య సత్వరమే పరిష్కరించాలని ఒక మెమొరాండం ఇవ్వాలని భావించారు. అధికారులు ఈ కార్మికులను పిఎంజి కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. అయితే వీరిలో నాలుగు వేల మంది కార్మికులను నాయకత్వం గాంధీ భవన్కి తీసికెళ్ళంది. సమ్మెకు పిలుపు ఇచ్చిన యూ...

ఉత్త‌మ కాల‌నీల‌కు ప్ర‌త్యేక అవార్డులు...ప్ర‌తి నెల 30వ‌ తేదీలోగా ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

Image
*ఉత్త‌మ కాల‌నీల‌కు ప్ర‌త్యేక అవార్డులు...ప్ర‌తి నెల 30వ‌ తేదీలోగా ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం* *ప్ర‌తి స‌ర్కిల్‌కు ఐదు అవార్డులు*     హైదరాబాద్ న‌గ‌రంలో స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల్లో కాల‌నీ సంక్షేమ సంఘాల‌ను మ‌రింత చురుకుగా భాగ‌స్వామ్యం చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఇందుకుగాను స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తూ ఆద‌ర్శంగా నిలిచిన కాల‌నీ సంక్షేమ సంఘాల‌కు ప్ర‌తినెల‌ ప్ర‌త్యేక పుర‌స్కారాలు అంద‌జేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. కాల‌నీ సంక్షేమ సంఘాల‌కు అవార్డులు అంద‌జేసే ప్ర‌క్రియ ఇటీవ‌ల నిలిచింది. కాల‌నీ సంక్షేమ సంఘాల‌కు తిరిగి అవార్డులు అంద‌జేయాల‌ని, ఇందుకుగాను 11విభాగాలను నిర్థారించి వాటిలో ఆయా కాల‌నీలు చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను తెలుపుతూ ప్ర‌తినెల 30వ తేదీలోగా సంబంధిత డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌కు అంద‌జేయాల‌ని, ఆర్‌డ‌బ్ల్యూఏల‌కు క‌మిష‌న‌ర్ సూచించారు. ఈ అవార్డుల వివ‌రాల‌న్నీ జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచ‌డం జ‌రిగింద‌ని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. ప్ర‌తినెల  5వ తేదీన ఈ అవార్డుల‌ను సంబంధిత డిప్యూటి క‌మిష‌న‌ర్లు అంద‌జేస్తార‌ని క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించారు. ఒక్కో స‌ర్కిల...

ఏక‌ధాటిగా 15 రోజులు షూటింగ్ చేసుకున్న `2 స్టేట్స్‌`

Image
ఏక‌ధాటిగా 15 రోజులు షూటింగ్ చేసుకున్న `2 స్టేట్స్‌` లక్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ , ప్రొడక్షన్స్ no.1 గా  రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌` (వర్కింగ్ టైటిల్ ). చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల `2 స్టేట్స్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వెంక‌ట్  కుంచం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎంఎల్‌వి స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ కోల్‌క‌త్తాలో ఏక‌ధాటిగా 15 రోజులు జ‌రిగింది. ఈ షెడ్యూల్ పూర్త‌యిన  సంద‌ర్భంగా ... నిర్మాత ఎంఎల్‌వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) మాట్లాడుతూ - ``ఏప్రిల్ నుండి `2 స్టేట్స్` చిత్రీక‌ర‌ణ‌ను అనుకున్న ప్లానింగ్‌లో చ‌క్క‌గా చేస్తున్నాం. హైద‌రాబాద్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఇటీవ‌ల‌ కోల్‌క‌త్తాలో సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం.  శేష్‌, శివాని, భాగ్య‌శ్రీ, ర‌జిత్ క‌పూర్‌, లిజి, ఆదిత్య మీన‌న్ కాంబినేష‌న్‌లో కీల‌క‌మైన టాకీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. ర‌షెస్ చూశాం.  సినిమా...

వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం – మంత్రి కెటి రామారావు

Image
వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం – మంత్రి కెటి రామారావు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. నగరంలో ఇళ్ల నిర్మాణ చాల వేగంగా నడుస్తున్నదని మంత్రి తెలిపారు.   మెత్తం 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని సమీక్షించారు. జియచ్ యంసి తరపున ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రికి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వేగంతో ముందుకు వెళ్తే వచ్చే డిసెంబర్ నాటికి సూమారు 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతున్నదని అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వచ్చే   ఏడాది జూన్ మాసం నాటికి పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో స్థానిక యంఏల్యేలు, యంపిలను   మరింత భాగస్వాములను చేయడం ద్వారా పర్యవేక్షణ,...