*చార్మినార్‌లో అకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్*
*చార్మినార్‌లో అకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్*
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చారిత్రక మక్కా మజీద్, చార్మినార్ ప్రాంతాల్లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి నేడు ఉదయం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రంజాన్ సందర్భంగా మక్కా మజీద్, చార్మినార్ ప్రాంతాల్లో వేలాది మంది ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను చేపట్టింది. నేడు ఉదయం దాదాపు రెండు గంటల పాటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా ప్రార్థనల నిర్వహణ రహదారులను పరిశుభ్రంగా ఉంచడం, రోడ్లకు ఇరువైపులా ఏ విధమైన వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చూడడం, రహదారులకు అవసరమైతే మరమ్మతులు నిర్వహించడంతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని షీ-టాయిలెట్లు, ఇతర టాయిలెట్ల నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చార్మినార్ జోన్ కమిషనర్ ఎన్.రవికిరణ్, డిప్యూటి కమిషనర్ అశోక్ సామ్రాట్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనుల పురోగతిని కూడా పరిశీలించారు. లాడ్ బజార్, మక్కా మజీద్, మదీన, పత్తర్‌గట్టి తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు.

Comments
Post a Comment