జేఎన్జే జర్నలిస్ట్స్ భూములపై కుట్రలా?
జేఎన్జే జర్నలిస్ట్స్ భూములపై కుట్రలా? నిజాంపేట్, పేట్ బషీరాబాద్ లో అక్రమాలు నిమ్మకాయల వంశీ శ్రీనివాస్ చట్టవ్యతిరేక చర్యలు! కుట్రలు బట్టబయలు చేసిన సభ్యులు సహకార శాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి-సభ్యులు హైదరాబాద్, జనవరి 9 (Toofan) : జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హైజింగ్ సోసైటీ సీఈ, కార్యదర్శిగా సుదీర్ఘంగా కొనసాగుతున్న నిమ్మకాయల వంశీ శ్రీనివాస్ చట్ట వ్యతిరేక చర్యలను సభ్యులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా బట్టబయలు చేశారు. 2023 లో వంశీ శ్రీనివాస్ పై చార్జిషీటు, ఎన్నికల సంఘం ద్వారా కేసు నిజం కాదా? అని ప్రశ్నించారు. 2022 సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంలో లోగుట్టు ఏమిటి? వెయ్యి కుటుంబాల ప్రయోజనాలను ఫణంగా పెట్టి భూములను జేఎన్జేహెచ్ఎస్ సభ్యులు అనుభవించకుండా ఎందుకు కుట్రపన్నారని నిలదీశారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా నిజాంపేట, పేట్ బషీరాబాద్ భూములు జేఎన్జేహెచ్ఎస్ మ్యాక్ సొసైటీ సభ్యులకు దక్కనివ్వకుండా కుట్రపన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం ...
1%20copy.jpg)
Comments
Post a Comment