కృష్ణసాగర్ రావును పరామర్శించిన దత్తాత్రేయ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నేత
- ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ గవర్నర్
తూఫాన్,హైదరాబాద్ :- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. అనారోగ్య కారణాలతో నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న కృష్ణసాగర్ రావును మంగళవారం దత్తాత్రేయ స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కృష్ణసాగర్ రావుకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించిన దత్తాత్రేయ, ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న కృష్ణసాగర్ రావు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరామర్శ సమయంలో పలువురు బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దత్తాత్రేయ పరామర్శ పట్ల కృష్ణసాగర్ రావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments
Post a Comment