బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా ఇంద్రసేన్ రెడ్డి

- పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా

- బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు 



తూఫాన్,హైదరాబాద్ :- ప్రముఖ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు బి. ఇంద్రసేన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆయనకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఇంద్రసేన్ రెడ్డి సేవలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని అధిష్టానం భావించింది.

రాంచందర్ రావుకు కృతజ్ఞతలు తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు రాంచందర్ రావుకు ఇంద్రసేన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయితీ, సమానత్వ భావంతో తెలంగాణలో బీజేపీని అగ్రస్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

వికసిత భారత్ లక్ష్యంగా.. ప్రస్తుతం లఘు ఉద్యోగ్ భారతి, భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరమ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇంద్రసేన్ రెడ్డి, తన పారిశ్రామిక అనుభవంతో 'వికసిత భారత్' లక్ష్య సాధనలో భాగస్వామ్యం అవుతానని పేర్కొన్నారు. ఇంద్రసేన్ రెడ్డి నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఆయన రాకతో పారిశ్రామిక మరియు సాంకేతిక వర్గాల్లో పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.



Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!