రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి: సంజయ్ రావు హామీ
- లఘు ఉద్యోగ్ భారతి ఆధ్వర్యంలో మిల్లర్లతో ముఖాముఖి
- సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులను సానుకూలంగా పరిష్కరిస్తాం: ఐఏఏఎస్ అధికారి
తూఫాన్,హైదరాబాద్ (సిటీ బ్యూరో) :- రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (IAAS) సంజయ్ రావు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో లఘు ఉద్యోగ్ భారతి - తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మిల్లర్లు తాము ఎదుర్కొంటున్న పలు సాంకేతిక, ఆర్థిక పరమైన ఇబ్బందులను సంజయ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను నిశితంగా పరిశీలించిన ఆయన.. ప్రభుత్వ పరిధిలోని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), రైస్ మిల్లర్ల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
లఘు ఉద్యోగ్ భారతి ప్రతినిధులు మాట్లాడుతూ.. మిల్లర్ల సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి జుగల్ కిషోర్ ఖండేల్వాల్, జగిత్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ రావు, మహబూబ్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, పెద్దపల్లి రైస్ ఇండస్ట్రీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మరియు లఘు ఉద్యోగ్ భారతి తెలంగాణ ఉపాధ్యక్షులు సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లర్లకు ఎదురవుతున్న అవరోధాలను తొలగించడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయవచ్చని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.

Comments
Post a Comment