బూర్గుల సేవలు చిరస్మరణీయం.. ట్యాంక్‌బండ్‌పై నివాళులర్పించిన దత్తాత్రేయ
- హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్ధంతి వేడుకలు
తూఫాన్,హైదరాబాద్ :- హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదుడు బూర్గుల రామకృష్ణారావు వర్ధంతిని పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్‌గా కూడా ఆయన తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా, సాహితీవేత్తగా ఆయన అందించిన స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా భూసంస్కరణల అమలులో ఆయన చూపిన చొరవ చారిత్రాత్మకమని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బూర్గుల అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Comments
Post a Comment