తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడికి ‘కమల’ నీరాజనం

- జంగంరావు గౌడ్ నివాసంలో బీజేపీ నేతల సందడి.. శుభాకాంక్షలు తెలిపిన  బీజేపీ సికింద్రాబాద్ మహాకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.గోపాల్


తూఫాన్,హైదరాబాద్ :- తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, చిక్కడపల్లి వివేకానగర్ వాసి జంగంరావు గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.గోపాల్ ఆధ్వర్యంలో పార్టీ తరుపున స్థానిక గాంధీనగర్ డివిజన్ బీజేపీ నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత టి.గోపాల్ స్థానిక నాయకులతో కలిసి జంగంరావు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా జంగంరావు గౌడ్ మరియు టి.గోపాల్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తెలంగాణ ఉద్యమ విశేషాలపై ఆత్మీయంగా చర్చించారు.

అనంతరం ఈ వేడుకకు బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ హాజరయ్యారు. జంగంరావు గౌడ్ ని శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని భరత్ గౌడ్ కొనియాడారు.


కార్యక్రమంలో జంగంరావు గౌడ్ కుమారుడు డాక్టర్ నరేష్ గౌడ్, వివేకానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాణీశ్వర శాస్త్రి, యువ నాయకులు దోనేటి సత్యం, శ్రీనివాస్ యాదవ్, నర్సింగరావు, చిలుకూరి అఖిలేష్, శ్రీనివాస్, మధు, సాయి, బంటి, వనజా రాణి తదితర నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!