డిజిటల్ యుగంలో సోషల్ మీడియానే అసలైన శక్తి
-యూసుఫ్‌గూడలో బీజేపీ సికింద్రాబాద్ పార్లిమెంట్ సోషల్ మీడియా 'నరేటివ్, నెట్‌వర్క్, నేషన్ బిల్డింగ్' వర్క్‌షాప్
-ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉండాలని సోషల్ మీడియా వారియర్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు
తూఫాన్,హైదరాబాద్ :- నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా కేవలం సమాచార మార్పిడికి మాత్రమే పరిమితం కాలేదని, అది ప్రజాభిప్రాయాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనంగా అవతరించిందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని ఎస్ఎంఎస్ఈ (SMSE) ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం నిర్వహించిన 'నరేటివ్, నెట్‌వర్క్, నేషన్ బిల్డింగ్' వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
నిర్మాణాత్మక పాత్ర పోషించాలి
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కీలకమన్నారు. సోషల్ మీడియా వాలంటీర్లు కేవలం పోస్టులు పెట్టడమే కాకుండా, సానుకూల దృక్పథంతో బాధ్యతాయుతమైన ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. "నేషన్ బిల్డింగ్" (దేశ నిర్మాణం)లో సోషల్ మీడియా వారియర్లు తమ వంతు పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రముఖ నిపుణుల శిక్షణ
ఈ వర్క్‌షాప్‌లో ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో వస్తున్న మార్పులపై నిపుణులు ప్రసాద్, సురేష్ కొచ్చర్, సాయిప్రసాద్ (99 TV), రాకా సుధాకర్ తదితరులు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. భవిష్యత్ ఐటీ పరిణామాలను ఎలా అందిపుచ్చుకోవాలి, ప్రత్యర్థుల అసత్య ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి అనే అంశాలపై వారు లోతైన విశ్లేషణ చేశారు.
తరలివచ్చిన నేతలు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, కార్యదర్శి బండారు విజయలక్ష్మి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, నాయకులూ గజానంద్ గౌడ్, మహిపాల్ రెడ్డి, ఇతర నాయకులూ బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.



Comments
Post a Comment