రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి 31 లక్షల చెక్కును అందజేసిన డిజిపి

 రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి 31 లక్షల చెక్కును అందజేసిన డిజిపి


రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందాల్సిన బీమా మొత్తాన్ని  డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో గురువారం నాడు అందజేశారు.


అంబర్‌పేట సిపిఎల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గత ఏడాది మార్చి 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.బోయ పాండుకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఉండటంతో, ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన ఆయన కుటుంబ సభ్యులకు రూ.కోటి 31 లక్షల చెక్కును డిజిపి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా డిజిఎం కె. మురళీకృష్ణ, సలహాదారు రిటైర్డ్ బ్రిగేడియర్ ఎస్.కె. ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!