- అభివృద్ధి ఎవరి కోసం.. ఎవరితో కలిసి.. ఏ దిశగా సాగుతోందన్నదే అసలైన ప్రశ్న - ఫ్రాన్స్ వేదికగా అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు - సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై జీ-7 దేశాల ప్రత్యేక దృష్టి తూఫాన్, హైదరాబాద్ :- ప్రపంచ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి కేవలం జీడీపీ అంకెలు, దేశాల మధ్య జరిగే వాణిజ్య గణాంకాలకే పరిమితం కాకూడదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా బుధవారం నిర్వహించిన ఔట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 'అందరికీ సమతుల్య, భాగస్వామ్య మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ' అనే అంశంపై జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ఆయన తన గళాన్ని బలంగా వినిపించారు. అంతర్జాతీయ వేదికపై మానవతా దృక్పథంతో కూడిన ప్రగతిని కాంక్షిస్తూ ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. ఫ్రాన్స్ జీ-7 అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణంలో.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యమైన ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం అభినందనీయమని ప్రధాని మోదీ కొనియ...