- భారతీయ మూలాలను మరువద్దు: వెంకయ్య నాయుడు తూఫాన్, హైదరాబాద్ :- "భారతీయ నాగరికతలో కళలు కేవలం వినోద సాధనాలు కావు.. అవి మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే సోపానాలు" అని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. శనివారం హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 'నాదోపాసన' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాదాన్ని బ్రహ్మగా భావించే గొప్ప సంస్కృతి మనదని, సంగీతం ద్వారా దైవానికి దగ్గరవ్వడమే నిజమైన నాదోపాసన అని ఆయన అభివర్ణించారు. ఆలయాలు సంస్కృతీ నిలయాలు కావాలి ఒకప్పుడు గ్రామాల్లోని దేవాలయాలు కేవలం పూజా మందిరాలు మాత్రమే కాదని.. విద్య, శిల్పం, సంగీతం, సాహిత్యం పరిమళించే విశ్వవిద్యాలయాలని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. నేడు మళ్ళీ ఆ వైభవం రావాలని, ఆలయాలను భారతీయ సంస్కృతీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రతి సాయంత్రం దేవాలయాల్లో సత్సంగాలు, హరికథలు, పురాణ కాలక్షేపం వంటి సంప్రదాయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా ప్రతిరోజూ అన్నమయ్య కీర్తనలు వింటూనే రోజును ప్రారంభిస్తా...