Posts

January 20th, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

డిజిటల్ యుగంలో సోషల్ మీడియానే అసలైన శక్తి

Image
-యూసుఫ్‌గూడలో బీజేపీ సికింద్రాబాద్ పార్లిమెంట్ సోషల్ మీడియా 'నరేటివ్, నెట్‌వర్క్, నేషన్ బిల్డింగ్' వర్క్‌షాప్ -ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉండాలని సోషల్ మీడియా వారియర్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు                        తూఫాన్,హైదరాబాద్ :- నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా కేవలం సమాచార మార్పిడికి మాత్రమే పరిమితం కాలేదని, అది ప్రజాభిప్రాయాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనంగా అవతరించిందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని ఎస్ఎంఎస్ఈ (SMSE) ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం నిర్వహించిన 'నరేటివ్, నెట్‌వర్క్, నేషన్ బిల్డింగ్' వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కీలకమన్నారు. సోషల్ మీడియా వాలంటీర్లు కేవలం పోస్టులు పెట్టడమే కాకుండా, సానుకూల దృక్పథంతో బాధ్య...

బంగారం మొక్కులు.. భక్తిపారవశ్యపు మునకలు: వనదేవతల రాకకు సర్వం సిద్ధం!

Image
 బంగారం మొక్కులు.. భక్తిపారవశ్యపు మునకలు: వనదేవతల రాకకు సర్వం సిద్ధం! సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం         హైదరాబాద్, జనవరి 17(తూఫాన్‌) : తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల  కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది.         అందుబాటులో ఉన్న సమాచారం అనుసరించి, ఈ జాతర యొక్క ప్రాశస్త్య మేమనగా 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాతంలోని పొలవాసను పాలించే ఆదివాసి దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కార...

January 18th, Sunday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : సీఎం

Image
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతామని వెల్లడించారు.  కొలువుల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. “పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే సంపూర్ణంగా సహకరించాలి. కొత్తగా చేరిన వారంతా చిత్తశుద్ధితో పనిచేయాలి.  దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలంటే మీరంతా కష్టపడి పనిచేయాలి. తలవంచకుండా, 30 నుంచి 35 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తల ఎత్తుకుని పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా పని చేయాలి.  ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది.  తద్వారా తెలంగాణను ఒక...

ఆదిలాబాద్‌కు ‘ప్రగతి’ తోరణం.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతాం!

Image
ఆదిలాబాద్‌కు ‘ప్రగతి’ తోరణం.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతాం! బాసరలో యూనివర్సిటీ.. నిర్మల్‌లో ఏటీసీ కేంద్రం: రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో రూ. 386 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన   తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాగు, సాగునీటి కోసం తుమ్మిడిహెట్టి వద్ద చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో కొత్తగా అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు.   ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రూ. 386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన "ప్రజా పాలన – ప్రగతి బాట" బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.   “తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌లో జరగాల్సినంత అభివృద్ధి, జిల్లాకు రావలసిన నీరు రాలేదు. పాలమూరు జిల్లాకు ఏ...

*గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం*

Image
*గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం* ● కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసిన వేళ… ● నిధులు లేవంటూ చెప్పిన ఇండియన్ ఎంబసీ ● రూ.10 లక్షల ప్రవాసీ బీమా ఉండి కూడా ఉపయోగం లేదు.  ● సీఎం సహాయనిధి ద్వారా రూ.1.50 లక్షల మానవీయ సాయం ● ప్రవాసీ ప్రజావాణి ఇంచార్జి జి. చిన్నారెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ చొరవ గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రవాస తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చూపుతున్న బాధ్యతకు ఇది మరో ఉదాహరణ.  నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు,  నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మ...