Posts

October 7th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 5th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 4th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 2nd, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం - Crime News Chikkadpally Police Station Hyderabad

Image
 పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రూ.90,800 కోల్పోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.... చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని మంగళ్య షాపింగ్ మాల్ వద్ద నివాసం ఉండే భాగమ్మ రజిత (35) అనే ప్రైవేట్ ఉద్యోగిని జూలై 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి సంబంధించిన పోస్ట్ చూశారు. ఆసక్తితో ఆమె వాట్సాప్ నంబర్ (9341843064) ద్వారా వారిని సంప్రదించారు. మొదట చిన్న చిన్న టాస్క్‌లు చేయించి, ప్రతిఫలంగా ఆమెకు రూ.10 క్రెడిట్ చేసి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత, నిందితులు ఆమెను **'నేషనల్ ఎక్స్ఛేంజ్' (National Exchange)** అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాలని సూచించారు. ఆ గ్రూప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అడిగారు. దీంతో ఆమె జూలై 6న రూ.10,800 నుంచి మొదలుపెట్టి, పలు దఫాలుగా రూ.44,000, రూ.32,000, రూ.4,000 చొప్పున మొత్తం **రూ.90,800...

తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్న సీఎం రేవంత్ - మాజీ మంత్రి హ‌రీష్ రావు - Harish Rao

Image
 దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు ఫలితాలు. ఎన్నికల ముందు పెండింగ్ డిఏ ను తక్షణమే చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు. కమిషన్లకు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల.. ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి. కాంగ్రెస్ అభయహస్తం కాదు బస్మాసుర హస్తం. దేశంలో ఎక్కడా లేని విధంగా 73% గరిష్ట పిఆర్సి అందించిన ఘనత కేసీఆర్ గారిదే.  కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డిఏలు, ఐదు సరెండర్ లీవులు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటు. 5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడింది. మీ అన్యాయానికి, అహంకారానికి, అరాచకాలను ఎక్కువ రోజులు సహించరు. రేవంత్ రెడ్డికి డిఏ అంటే డోంట్ అస్క్. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన ఉద్యోగ సంఘ నాయకులపై అక్రమ కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గం. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది....

దుర్గాష్టమి పూజ నిర్వహించిన మేయర్ - GHMC observes Dugashtami Pooja at Hyderabad Office

Image
  దుర్గాష్టమి పూజ నిర్వహించిన మేయర్ హైదరాబాద్, అక్టోబర్ 1(Toofan):     విజయదశమి పురస్కరించుకొని బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన  కార్యాలయంలోని తన ఛాంబర్ లో (Vijaya Lakshmi) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor - GHMC) దంపతులు దుర్గాష్టమి పూజ నిర్వహించారు.  అదనపు కమిషనర్ లు రఘు ప్రసాద్, కే వేణుగోపాల్, విజిలెన్స్ డీఎస్పీ నరసింహ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, ఓఎస్డి విజయ్ కృష్ణ, అఖిల్,పేషీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  అధికారులు, సిబ్బంది కి మేయర్  దసరా శుభాకాంక్షలు తెలిపారు.  అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రార్థించారు.  గ్రేటర్ హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగాలని  ఆకాంక్షించారు.