సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్ *హైదరాబాద్, జూన్ 17:(TOOFAN) సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏ ఎం అండ్ హెచ్ ఓ లు, ఎంటమాలజీ అధికారులతో శానిటేషన్, దోమల నివారణ, ఆస్తిపన్ను వసూళ్ల పై కమీషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... దోమల నివారణకు చేస్తున్న ఫాగింగ్ పై అసిస్టెంట్ మెడికల్ అధికారి పూర్తి బాధ్యత ఉంటుందని ఆదేశించారు. ఫాగింగ్ సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు తప్పని సరిగా చేయాలని, ఏ ఎల్ ఓ లు క్షేత్ర స్థాయిలో యాంటీ లార్వా కార్యక్రమం, ఉదయం, సాయంత్రం ఫాగింగ్ పనులు చేపట్టాలని, ఫాగింగ్ పెట్రోల్, డీజిల్ కూపన్ లు ఇవ్వమని, ఫ్రీ పెయిడ్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఈ ప్రక్రియ ఖైరతాబాద్ జోన్ లో ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు వచ్చాయన్నారు. మార్నింగ్ ఏ ఎల్ ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కాలేజీలో డెంగ్యూ, మలేరి...