లంచం తీసుకుంటూ పట్టుబడిన కంప్యూటర్ ఆపరేటర్

లంచం తీసుకుంటూ పట్టుబడిన కంప్యూటర్ ఆపరేటర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(తూఫాన్‌)  – బూర్గంపహాడ్: రేషన్ కార్డు జారీ కోసం అధికారిక సహాయం చేయడాన్నికార‌ణంగా తీసుకొని రూ.2,500 లంచం తీసుకుంటుండగా బూర్గంపహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ చిట్టెంశెట్టి నవక్రాంత్ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

ఫిర్యాదుదారుడి బంధువుకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తును ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, తద్వారా కొత్త రేషన్ కార్డు మంజూరు కావడానికి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయాలంటే నగదు చెల్లించాల్సిందేనంటూ నవక్రాంత్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారుల గూర్చిన సమాచారం ప్రకారం, ఇతడు తరచుగా రేషన్ కార్డు దరఖాస్తుల వ్యవహారాల్లో లంచం డబ్బులను డిజిటల్ చెల్లింపుల రూపంలో తీసుకుంటూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజలపై భారం వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి