ఆహారంలో నాణ్య‌త ప్ర‌మాణాలు తప్ప‌నిస‌రిగా పాటించాలి

 ఆహారంలో నాణ్య‌త ప్ర‌మాణాలు తప్ప‌నిస‌రిగా పాటించాలి

టూరిజం ప్లాజాలో మంత్రి జూప‌ల్లి ఆక‌స్మిక త‌నిఖీలు

రెస్టారెంట్ ను ప‌రిశీలించి, ప‌ర్యాట‌కుల‌తో మాట్లాడిన మంత్రి

       TOOFAN Telugu Daily -  టూరిజం ప్లాజా హోట‌ల్స్ లో ప‌రిశుభ్ర‌త పాటించాల‌ని,  ఆహారంలో నాణ్య‌త ప్ర‌మాణాలు  త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. బేగంపేట‌లోని టూరిజం ప్లాజా హోట‌ల్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం మంత్రి జూప‌ల్లి ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు. రెస్టారెంట్ అంతా క‌లియ‌తిరుగుతూ..  ఆహార పదార్థాలను, కిచెన్ ను పరిశీలించారు. 


అల్ఫాహారం చేస్తున్న ప‌ర్యాట‌కులు, అతిధుల‌తో మంత్రి జూప‌ల్లి మాట్లాడారు. ఆహార  నాణ్య‌త‌, రుచి గురించి ఆరా తీశారు. అనంత‌రం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..  హ‌రిత హోట‌ల్స్ లో సౌక‌ర్యాలు, ఆహార నాణ్య‌త‌పై  నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప‌ర్యాట‌కుల‌కు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆదాయం పెంచ‌డంతో పాటు ప‌ర్యాట‌కులు, అతిధుల కోసం మెరుగైన సౌక‌ర్యాలు, వ‌స‌తుల క‌ల్ప‌నపై  ప్ర‌ధానంగా దృష్టి పెడుతున్నామ‌ని అన్నారు. ఆహ్లాద‌క‌ర‌మైన వాతార‌ణం ఉండేలా హ‌రిత హోట‌ల్స్ ను తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. 

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి