చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌పై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయవాది మరియు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ దొనేటి భాను చందర్ శనివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — "ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా మరియు శాసనబద్ధ ప్రజాపాలనను అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. కాబట్టి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి," అని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అభిషేక్ కెనడీ, నర్సింగ్ రావు, గుండు జగదీశ్‌బాబు, నరేందర్ యాదవ్, గుర్రం దినేష్, మజర్, హాఫీజ్, దినేష్, ముష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment