సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

 సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్




*హైదరాబాద్, జూన్ 17:(TOOFAN)   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏ ఎం అండ్ హెచ్ ఓ లు, ఎంటమాలజీ అధికారులతో శానిటేషన్, దోమల నివారణ, ఆస్తిపన్ను వసూళ్ల పై కమీషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ...  దోమల నివారణకు చేస్తున్న ఫాగింగ్ పై అసిస్టెంట్ మెడికల్ అధికారి పూర్తి బాధ్యత ఉంటుందని ఆదేశించారు. ఫాగింగ్ సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు తప్పని సరిగా చేయాలని, ఏ ఎల్ ఓ లు క్షేత్ర స్థాయిలో యాంటీ లార్వా కార్యక్రమం, ఉదయం, సాయంత్రం ఫాగింగ్ పనులు చేపట్టాలని, ఫాగింగ్ పెట్రోల్, డీజిల్ కూపన్ లు ఇవ్వమని, ఫ్రీ పెయిడ్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఈ ప్రక్రియ ఖైరతాబాద్ జోన్ లో ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు వచ్చాయన్నారు.


మార్నింగ్ ఏ ఎల్ ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు,  కాలేజీలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. ఫాగింగ్ సర్కిల్ వారీగా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, జోనల్ స్థాయిలో ఎస్ ఈ లు బాధ్యత తీసుకోవాలన్నారు. కాలనీలో డ్రైనేజీ నాలాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ వ్యాధి ప్రబలిన జాబితా బస్తీ దవాఖానా, పి హెచ్ సి నుండి సేకరించిన వ్యక్తుల ఇంటి నుండి ఎస్ ఓ పి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. ఫాగింగ్ షెడ్యూల్డ్ సంబంధిత కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

 
శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ వార్డుల వారీగా జరుగుతున్న నేపథ్యంలో చెత్తను సకాలంలో రాంకీ ఎస్ ఎస్ ఆర్ వాహనాలు ద్వారా తరలించాలన్నారు. మెయిన్ రోడ్డు పైన సి అండ్ వెస్ట్ గాని, వాటర్ లాగింగ్, అనుమతులు లేని హోల్డింగ్ లు ఉండవద్దని అధికారులను ఆదేశించారు. పార్కు, చెరువు ల వద్ద వాకింగ్ ట్రాక్ వద్ద కూడా ఫాగింగ్ చేయాలన్నారు. లేక్స్ వద్ద ఉన్న వాకింగ్ ట్రాక్ లో ఉన్న చెట్లను ప్రూనింగ్, ప్లాంటేషన్ యు బి డి విభాగం చేయాలన్నారు. 


నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలని బిల్లు కలెక్టర్ కు ఇచ్చిన టార్గెట్ మేరకు వసూలు చేయాల్సిందేనన్నారు. రెసిడెంట్ భవనంలో కమర్షియల్స్ చేస్తున్న ఇళ్లను గుర్తించి టాక్స్ వాసులు చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్  లేని పక్షంలో టాక్స్ వసూలు చేయాలన్నారు. ప్రతి నెల టాక్స్ పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. బౌన్స్ చెక్కులు బేగం పేట్, సరూర్ నగర్ లో ఎక్కువ వచ్చినందున వాటిని వెంటనే క్లియర్ చేయాలని సంబంధిత డీ.సి లను ఆదేశించారు. గత సంవత్సరం ఇదే నెలలో వసూలు చేసిన ట్యాక్స్ ఈ మాసంలో పూర్తిగా వసూలు చేయలేదని, వెంటనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని డి సి లను ఆదేశించారు. రెసిడెన్షియల్ లో కమర్షియల్స్ చేస్తున్న ప్రధాన రోడ్డు లో ఉన్నవి గుర్తించాలని లేనిపక్షంలో వాటి పై విజిలెన్స్ విచారణ చేస్తామని హెచ్చరించారు.


కుక్కల బెడద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. స్టెర్లిసేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనలు పాటించాలని ఆదేశించారు. కుక్కల దత్తాత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, అప్పుడే పెట్ డాగ్ లైసెన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ పాయిజన్ కాకుండా మటన్, చికెన్ షాపులను ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు చేయాలని చీఫ్ వెటర్నరీ అధికారి  ఆదేశించారు. నిల్వ ఉన్న పదార్థాలు అమ్మే  అవకాశం ఉన్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్ష కోసం ల్యాబ్ కు పంపాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, రవి కిరణ్, వెంకన్న,  డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మెడికల్ అధికారులు, ఎంటమాలజి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి