గ్రామీణ సంపదకు నిలయం 'మూలం' సంత



తార్నాకలోని మర్రి చెన్నారెడ్డి హాల్లో శనివారం నిర్వహించిన 12వ మూలం సంతకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామభారతి మరియు సీఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 75 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ మాట్లాడుతూ — "ప్రకృతి ఆధారిత గ్రామీణ ఉత్పత్తుల సమాహారమే మూలం సంత. గ్రామీణ వ్యవసాయాన్ని, గోఆధారిత జీవనాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సంతను నిర్వహిస్తున్నాం," అని తెలిపారు. రైతులు తయారు చేసిన ప్రకృతి ఉత్పత్తులను ఆదరించాలని, నగర ప్రజలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ జీవనాన్ని ప్రోత్సహించాలన్నారు.

కార్యక్రమంలో గ్రామభారతి ఉపాధ్యక్షులు ఉట్నూరి లింగం గౌడ్, రాజమౌళి, సంయుక్త కార్యదర్శి బండి సురేష్ గౌడ్, శివకుమార్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










 

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి