ఉప్పల్ మినీ శిల్పారామం లో "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఘనంగా ప్రారంభం హైదరాబాద్, జూలై 12: TOOFAN ఉప్పల్ మినీ శిల్పారామంలో పది రోజులపాటు నిర్వహించబోయే "హస్తకళల థీమాటిక్ ఎక్సిబిషన్" ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి శృతి పాటిల్ ఐఐఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, శ్రీమతి సువర్చలా, అసిస్టెంట్ డైరెక్టర్, అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు), మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, భారత ప్రభుత్వం, శ్రీ జి. కిషన్ రావు, ఐఏఎస్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్, శ్రీ దోశాడ కృష్ణచారి గారి, నేషనల్ అవార్డు గ్రహీత (సిల్వర్ ఫిలిగ్రి) మరియు శ్రీ విజయసాగర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, ఏపిపిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథులు ఎక్సిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ హస్తకళా స్టాల్స్‌ను సందర్శించి, కళాకారుల పనితీరును ప్రశంసించారు. వారు తయారు చేస్తున్న వస్తువుల తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కళాకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు శిక్షణలు పొందినవారు, తమ ఉత్పత్తులను అమ్ముతూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ సం...