అంబులెన్సు సేవలు ప్రారంభం : ఎస్పీ రోహిత్ రాజు


జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్ల మండలం పూసగుప్ప గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మితమైన మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్సు సేవలు ప్రారంభం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పూసుగుప్పలో ఈ రోజు మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్స్ సేవలను ప్రారంభించడం జరిగింది.భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారితో పాటు, జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లు పాల్గొన్నారు.స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధుల ద్వారా విడుదలైన కోటి రూపాయల వ్యయంతో ఈ మొబైల్ హాస్పటల్ ను నిర్మించడం జరిగింది.


చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి సారథ్యంలో పోలీస్ శాఖ విశేష సేవలను అందిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  ఈ సందర్భంగా అన్నారు.  పూసుగుప్ప గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే భద్రాచలం,కొత్తగూడెం పట్టణాలకి వెళ్లడానికి ఒకప్పుడు సరైన రహదారి కూడా లేదని,కానీ ఇప్పుడు ఇదే పూసుగుప్ప గ్రామానికి చర్ల నుండి అరగంట వ్యవధిలోనే చేరుకునే విధంగా రహదారిని మరియు ఇప్పుడు ఈ హాస్పిటల్ ని ప్రారంభించడంలో చర్ల పోలీసుల కృషి ఎంతగానో ఉందని అన్నారు.ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందవలసిన సంక్షేమ పథకాలు కానీ,అభివృద్ధి కార్యక్రమాలు గానీ ఆదివాసీ ప్రజలకు అందజేయడంలో జిల్లా పోలీసుల కృషి అభినందనీయం అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు.అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఏజెన్సీ ప్రాంతవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించడంలో స్థానిక పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఆదీవాసీ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు.సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్ర గ్రామాలైన రాంపురం,భీమారం గ్రామాల ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు.అనంతరం అంబులెన్స్ వాహన సేవలను ప్రారంభించారు.ఇటీవల పూసుగుప్ప నుండి రాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా నిర్మితమైన బీటి రోడ్డును పరిశీలించారు.


ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్,చర్ల ఇన్స్పెక్టర్ రాజు వర్మ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ చెన్నూరి శ్రీనివాస్, E. శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి