కోటపల్లి తహశీల్దార్ కార్యాలయంలో లంచం కలకలం: డిప్యూటీ తహశీల్దారు, అటెండర్ అరెస్టు
కోటపల్లి తహశీల్దార్ కార్యాలయంలో లంచం కలకలం: డిప్యూటీ తహశీల్దారు, అటెండర్ అరెస్టు
మంచిర్యాల, జూలై 4:(TOOFAN) రెవెన్యూ రికార్డుల్లో పేరును అనుసంధానించి, పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేయాలనే నిమిత్తం ఫిర్యాదుదారుని నుండి రూ.10,000 లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా కోటపల్లి తహశీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహశీల్దారు ఆకిరెడ్డి నవీన్ కుమార్, అటెండర్ గవిడి అంజన్న Telangana ACB (అనిశా) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుడి తండ్రి (పట్టాదారు) ఆధార్‌ను రెవెన్యూ ఖాతాతో అనుసంధానించి, సంబంధిత పత్రాలను ప్రాసెస్ చేసి, ఉన్నతాధికారులకు పంపించేందుకు మరియు చివరికి పాసుపుస్తకం జారీ చేయడానికే అధికారులు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. తండ్రి అనారోగ్యం కారణంగా అతని తరుపున అటెండర్‌గా పనిచేస్తున్న గవిడి అంజన్న కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నాడు.
ఫిర్యాదుదారుడి నుంచి వచ్చిన సమాచారంపై స్పందించిన రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి, డిప్యూటీ తహశీల్దారు, అటెండర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Post a Comment