మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం

 మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం

ఎన్ హెచ్ ఆర్ సి సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) వివిధ శాఖల అధికారులతో మంగళవారం నాడు సమావేశమైంది.  గౌరవనీయ చైర్‌పర్సన్ శ్రీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, గౌరవ సభ్యులు శ్రీమతి విజయ భారతి సయానీ, డా.జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, టి ఎస్ హెచ్ ఆర్ సి  గౌరవ చైర్మన్ జస్టిస్ శ్రీ షమీమ్ అక్తర్, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్), శ్రీ ఆర్ . ప్రసాద్ మీనా, రిజిస్ట్రార్ (లా) డిప్యూటీ శ్రీ జోగిందర్ సింగ్ తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్  నుండి పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మహిళలపై నేరాలు అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా డిజిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో  ఉమన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తుందన్నారు. వివిధ ప్రాంతాలకు చెందినవారు హైదరాబాద్ లో  నివసిస్తున్నందున మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు, భరోసా కేంద్రాల స్థాపన, అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి నూతన విధానాల ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని తెలియజేశారు. మహిళలు ఇబ్బందులకు గురి చేస్తున్న ఈవ్ టీజింగ్ వంటి అంశాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మిస్సింగ్ ఉమెన్ సంఘటన విషయంలో త్వరితగతిన స్పందిస్తున్నామని తెలియజేశారు. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కోసం 31 భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని , ఈ కేంద్రాల ద్వారా మహిళా బాధితులకు అవసరమైన అన్ని రకాల మద్దతు ఇస్తూ వన్ స్టాప్ సెంటర్లుగా కొనసాగిస్తున్నామన్నారు. బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాల ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నామన్నారు. ట్రాన్స్ జెండర్ సెల్, ఎన్నారై సెల్, సాహా స్ లను కొనసాగిస్తున్నామన్నారు. భవనాల నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాల్లో ఉన్న మహిళల, పిల్లల విషయంలో అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ట్రాన్స్ జెండర్లు  ఎంతమంది ఉన్నారనే గణాంకలను సేకరిస్తున్నామన్నారు.స్పెషల్ సీఎస్ (హోం) శ్రీ రవి గుప్తా  ఐపీఎస్,  డైరెక్టర్ జనరల్ (జైళ్లు & కరెక్షనల్ సర్వీసెస్) శ్రీమతి సౌమ్య మిశ్రా ఐపీఎస్, మరియు శాంతి భద్రతల అదనపు డిజిపి శ్రీ మహేష్ ఎం. భగవత్ ఐపీఎస్ , సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి, ఐ జి పి కోఆర్డినేషన్ శ్రీ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి