కళా సేతు, భాషా సేతు : పోటీలకు దరఖాస్తులకు ఆహ్వానం

 

జాతీయ స్థాయిలో ‘కళా సేతు’ పోటీలను ప్రారంభించిన స్టార్టప్ యాక్సిలేటర్ వేవ్‌ఎక్స్: ప్రజలందరికీ పరిపాలనను చేరువ చేసేలా


బహుళ భాషల్లో మల్టీ మీడియా కంటెంట్ రూపొందించే పరిష్కారాలను ఆవిష్కరించాల్సిందిగా ఏఐ ఆధారిత అంకుర సంస్థలకు ఆహ్వానం

భారతీయ భాషల్లో ఇచ్చిన సారాంశం ఆధారంగా మల్టీ మీడియా కంటెంట్ రూపొందించే ఏఐ టూల్స్‌ను తయారు చేయాలని అంకుర సంస్థలకు సవాలు విసిరిన ‘కళా సేతు’

బహుభాషా కంటెంట్‌లో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించే కళా సేతు, భాషా సేతు : పోటీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు వరుసగా జులై 30, జులై 22


డిజిటల్ పాలనను భారత్ వేగవంతం చేస్తున్న తరుణంలో.. ప్రజలకు వారి భాషలోనే వేగంగా, సమర్థవంతంగా సమాచారాన్ని అందించడం చాలా కీలకంగా మారింది. ప్రజలను చేరుకోవడంలో స్థాయిని, వేగాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో సంప్రదాయ కంటెంట్ విధానానికి పరిమితులు ఉన్నాయి.


సమ్మిళితమైన, సాంకేతిక ఆధారిత సమాచారాన్ని అందించాలనే ప్రభుత్వం అంకితభావానికి అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇవి భాషాపరమైన అవరోధాలను అధిగమించి చివరి వ్యక్తి వరకు సమాచారాన్ని చేరవేస్తాయి.

కళా సేతు: రియల్ టైం లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్

సమ్మిళిత సమాచార వ్యవస్థకోసం ఏఐ శక్తిని ఉపయోగించుకోవాలనే వ్యూహాత్మక ఆలోచనలో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ‘‘కళా సేతు - రియల్ ‌టైం లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్’’ పేరుతో పోటీని ప్రారంభించింది. దీనిని వేవ్ఎక్స్ స్టార్టప్ యాక్సిలేటర్ ఫ్లాట్‌ఫాం ద్వారా నిర్వహిస్తోంది. భారతీయ భాషలకు మద్దతు అందించేలా టెక్స్ట్ రూపంలో ఇచ్చిన సమాచారంతో ఆడియో, వీడియో, గ్రాఫిక్ కంటెంట్‌ను తయారు చేసే సమర్థమైన దేశీయ పరిష్కారాలను అందించాలని ఏఐ అంకుర సంస్థలను ఈ జాతీయ పోటీ ఆహ్వానిస్తోంది.

ఏఐ ఆధారిత కంటెంట్‌ను తయారుచేయడంలో మూడు ప్రధాన రంగాలకు తోడ్పడేలా సమర్థమైన పరిష్కారాలను అందించడంపై ఈ పోటీ దృష్టి సారిస్తుంది. మొదటిది.. టెక్స్ట్ నుంచి వీడియో తయారు చేయడం. దీనిలో వివిధ సమాచార అవసరాలకు అనుగుణంగా పరిసరాలు, స్వర స్థాయి, అవసరానికి అనుగుణంగా అంశాన్ని మార్చుకొనే సామర్థ్యంతో టెక్స్ట్ నుంచి వీడియోను తయారు చేయడానికి అనుమతిస్తుంది. రెండోది... టెక్స్ట్ నుంచి గ్రాఫిక్స్ తయారుచేయడం. సంక్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా డేటా ఆధారిత ఇన్ఫోగ్రాఫిక్స్‌ను, వివరణాత్మక విజువల్స్‌ను ఆకర్షణీయంగా తయారు చేస్తుంది. మూడోది... టెక్స్ట్ నుంచి ఆడియో తయారుచేయడం, ఇది అధునాతన స్వర సంశ్లేషణ పద్ధతిని ఉపయోగించి స్పష్టమైన, భావోద్వేగాలను ప్రదర్శించే, ప్రాంతీయ మాండలీకాలకు తగినట్టుగా ప్రసంగాన్ని తయారు చేస్తుంది. తద్వారా బహు భాషల్లో ఎక్కువ మందికి చేరువై తన ప్రభావాన్ని చూపిస్తుంది.

పౌర కేంద్రక దరఖాస్తులు

అధికారిక సమాచారాన్ని ప్రాంతీయ అవసరాలకు తగినట్టుగా మార్చే వీలును ప్రభుత్వ సమాచార వ్యవస్థలకు కల్పించడం ద్వారా డిజిటల్ భాషా అంతరాన్ని తగ్గించడమే కళా సేతు లక్ష్యం. దీని కోసం ఇన్ఫోగ్రాఫిక్ విజువల్స్, సందర్భోచితంగా వీడియో వివరణలు, ఆడియో, న్యూస్ క్యాప్సూల్స్‌ను స్థానికంగా ఉపయోగపడేలా అప్పటికప్పుడు తయారు చేస్తుంది. రైతులకు వాతావరణ హెచ్చరికలు తెలియజేయడం, విద్యార్థికి పరీక్షకు తాజా సమాచారాన్ని అందించడం లేదా వయోధికులకు ఆరోగ్య పథకాల గురించి వివరించడమైనా.. ఈ కార్యక్రమం సందర్భానికి తగినట్టుగా సమాచారాన్ని, వారి మాతృభాషల్లో అందిస్తుంది.

దరఖాస్తు విధానం

కళా సేతు విభాగంలో పాల్గొనే అంకుర సంస్థలు వేవ్ ఎక్స్ పోర్టల్ https://wavex.wavesbazaar.com లో రిజిస్టర్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. తాము రూపొందించిన పరిష్కారానికి సంబంధించిన డెమో వీడియోను ప్రదర్శించే మినిమం వయబుల్ కాన్సెప్ట్ (ఎంవీసీ)ను జులై 30 నాటికి సమర్పించాలి. తుది పోటీలకు ఎంపికైన షార్ట్ లిస్ట్ బృందాలు న్యూఢిల్లీలో జ్యూరీ ముందు తమ పరిష్కారాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. విజేతగా నిలిచిన వారికి తమ పరిష్కారాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవగాహనా ఒప్పందంతో పాటు.. ఏఐఆర్, డీడీ, పీఐబీ నుంచి ప్రయోగాత్మక సహకారం లభిస్తుంది. అలాగే వేవ్ఎక్స్ ఆవిష్కరణ వేదిక ద్వారా అభివృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుంది. పోటీలకు సంబంధించిన సాంకేతిక అవసరాలు, ఇతర వివరాలను వేవ్ ఎక్స్ పోర్టల్ లో తెలుసుకోవచ్చు.

భాషా సేతు ఛాలెంజ్

వేవ్ ఎక్స్ ద్వారా వాస్తవ సమయంలో అనువాదం చేసే ‘భాషా సేతు’ పోటీని 2025 జూన్ 30న ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వేవ్ఎక్స్ పోర్టల్‌లో భాషా సేతు కేటగిరీలో జులై 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సమ్మిళితమైన, సమర్థవంతమైన ఏఐ ఆధారిత పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రభుత్వానికున్న బలమైన అంకితభావాన్ని ఈ పోటీలు తెలియజేస్తాయి. బహు భాషల్లో కంటెంట్ తయారుచేయడం, అప్పటికప్పుడు భాషానువాదం చేయడంలో స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా సమాచార లోపాన్ని పరిష్కరించడంతో పాటు.. ప్రతి భారతీయ భాషలోనూ చివరి వ్యక్తి వరకు సమాచారం చేరువయ్యేలా చూస్తాయి. భవిష్యత్తు అవసరాలకు తగిన డిజిటల్ వ్యవస్థలను నిర్మించడంలో కళా సేతు, భాషా సేతు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూనే.. శక్తిమంతమైన అంకుర సంస్థల ఆవిష్కరణ వ్యవస్థను ప్రోత్సహిస్తాయి.

వేవ్ఎక్స్ గురించి

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపడుతున్న వేవ్స్ కార్యక్రమంలో భాగంగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు వేవ్ఎక్స్ నిర్వహిస్తున్నారు. మీడియా, వినోద, భాషా సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలను ఇది ప్రోత్సహిస్తుంది. 2025 మేలో ముంబయిలో నిర్వహించిన వేవ్స్ సదస్సులో 30 అంకుర సంస్థలకు వేవ్ఎక్స్ గొప్ప అవకాశాలను కల్పించింది. ప్రభుత్వ సంస్థలు పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో ప్రత్యక్షంగా ఒప్పందాలు ఏర్పాటు చేసుకొనే వీలు కల్పించింది. లక్ష్య ఆధారిత హ్యాకథాన్లు, ఇంక్యుబేషన్, మార్గదర్శకత్వం, జాతీయ వేదికలతో ఏకీకరణ ద్వారా పురోగతిని సాధించే ఆలోచనలకు తోడ్పాటు అందిస్తూనే ఉంటుంది.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి