Posts

Showing posts from December, 2025

మాండలిక భాషలోనే వాస్తవిక కథలు రావాలి... Session - 2

Image
పిల్లలకు నిత్య జీవిత వాస్తవాలను పరిచయం చేయాలి..... హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో జరిగిన  "Different Childhoods, Different Tales" చర్చ కార్యక్రమంలో వక్తల పిలుపు తూఫాన్(హైదరాబాద్) :- 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో భాగంగా అనిశెట్టి రజిత వేదిక పై ఆదివారం సాయంత్రం... రెండవ సెషన్ లో భాగంగా Different Childhoods, Different Tales చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి  డా.అస్మా రషీద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. డా.షెఫాలీ ఝా, డా.గోగు శ్యామల, కనీజ్ ఫాతిమా, డాక్టర్ మధు మిత సిన్హా, డా.ఉమా భృగుబండ మాట్లాడారు.కార్యక్రమానికి అస్మా ఫాతిమా moderator గా వ్యవహరించారు. షెఫాలీ ఝా ప్రసంగిస్తూ, బాల్య స్మృతులే మనిషి వ్యక్తిత్వానికి పునాది వేస్తాయని, పుస్తక జ్ఞానాన్ని సామాజిక సేవతో ముడిపెట్టినప్పుడే జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. తన చిన్నతనంలో దర్గా ఆవరణలోని చింత చెట్టు కింద ఆడుకుంటూనే, అక్కడి మసీదు వెనుక ఒంటరిగా నివసించే ఓ వృద్ధురాలికి (ఖాలా) సహాయం చేసిన తీరును గుర్తుచేసుకుంటూ.. ఆనాటి సామాజిక అనుభవాలే తనలో మానవత్వాన్ని పెంపొందించాయని వివరించారు. ‘స్వేచ్ఛ’ వంటి నవలలు గుర్తింపునిస్తే,...

భారత భద్రత.. రాజీలేని పోరాటం....

Image
 'ఆపరేషన్ సింధూర్' మన దృఢ సంకల్పానికి నిదర్శనం: ప్రధాని మోదీ కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో "మన్ కీ బాత్" వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులూ... తూఫాన్(హైదరాబాద్) :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన్ కీ బాత్' 129వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని, పార్టీ శ్రేణులు, స్థానిక పారిశుధ్య కార్మికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా 2025 ఏడాదిని భారతావనికి జాతీయ గర్వకారణమైన సంవత్సరంగా ప్రధాని అభివర్ణించారు. దేశ భద్రత, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట దేశ రక్షణలో భారత్ రాజీలేని పోరాట పటిమను ప్రదర్శిస్తోందని, 'ఆపరేషన్ సింధూర్' ద్వారా మన జాతీయ భద్రతా దృఢత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని ప్రధాని పేర్కొన్నారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి దేశభక్తిని మరోసారి ప్రధాని స్మరించుకున్నారు. అలాగే 'తమిళం నేర్చుకుందాం - తమిళ కరకలం' చొరవ ద్వారా భాషా వైవిధ్యం, సాంస్కృతిక ఐక్యతను పెంపొ...

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

Image
  38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ‘పుస్తక స్ఫూర్తి’పై మేధోమథనం వచ్చే ఐదేళ్లలో అప్పులు లేని సమాజమే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు తూఫాన్(హైదరాబాద్) :- అక్షరం మనిషిని ఆలోచింపజేస్తుందని, పుస్తకం జీవితానికి కొత్త దిశను చూపే దారిదీపమని పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ‘అనిశెట్టి రజిత’ వేదికపై ‘పుస్తక స్ఫూర్తి - పుస్తకం ఒక దారిదీపం’ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని వక్తలను సన్మానించారు. కోటి రూపాయలతో పుస్తకాల పంపిణీ: మంత్రి జూపల్లి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో పఠనాసక్తిని పెంచేందుకు తమ శాఖ తరపున  కోటి రూపాయల  వ్యయంతో స్ఫూర్తిదాయక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్...

డెస్క్ జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం

Image
బస్ పాస్ లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తింపజేయిస్తాం అవాస్తవాలతో కొందరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు -టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ  తూఫాన్(హైదరాబాద్) :-   జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి  స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్ పాస్ లతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్...

మనసుకు శాంతిని, సమాజానికి మేధావిని ఇచ్చేది పుస్తకమే....

Image
 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తూఫాన్(హైదరాబాద్):- పుస్తక పఠనం అభ్యాసమైతే అది మనిషికి మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, గొప్ప మేధావిగా తీర్చిదిద్దుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో నిర్వహించిన ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. విద్యార్థులు ప్రతి స్టాల్‌ను సందర్శించి తమకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవాలని సూచించారు. పఠనం అనేది కేవలం సమాచారం కోసమే కాకుండా, మెదడుకు పదును పెట్టి విజ్ఞానాన్ని, ఆనందాన్ని పంచుతుందని చెప్పారు. తన జీవిత ప్రయాణంలో ‘నెపోలియన్ ది గ్రేట్’ పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆయన నిఘంటువులో ‘అసాధ్యం’ అనే పదమే లేదన్న స్ఫూర్తితోనే తాను సమాజ సేవలో నిమగ్నమయ్యానని దత్తాత్రేయ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పుడు భగవద్గీత తనకు జీవిత పరమార్థాన్ని బోధించిందని, కోవిడ్ వంటి విపత్కర కాలంలో మహాభాగవతం చదవడం వల్ల మానసిక ధైర్యం, శక్తి లభించాయని గుర్తుచేసుకున్నారు. నేటికీ తాను రాత్రి వేళల్లో పఠనానికి సమయం కేటాయిస్తానని చెబుతూ.. మనం ఎంత ఎక్కువగా చదివితే అంత వినమ్రత పె...

December 28th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అంబర్‌పేటలో ఘనంగా వీర్ బాల్ దివస్....

Image
 సిక్కు గురువుల త్యాగాలను స్మరించుకున్న నేతలు 6 నంబర్ చౌరస్తా నుంచి అలీ కేఫ్ వరకు భారీ ప్రదర్శన తూఫాన్(హైదరాబాద్):- సిక్కు మత పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్‌ల వీరోచిత త్యాగాలను స్మరిస్తూ అంబర్‌పేటలో గురువారం రాత్రి 'వీర్ బాల్ దివస్' వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక 6 నంబర్ చౌరస్తా నుండి అలీ కేఫ్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో నాయకులు, సిక్కు సామాజిక వర్గ ప్రతినిధులు మషాల్ (కాగడాలు), కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్మరణలో రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, నాయకులు దీపక్ రెడ్డి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే మతం కోసం, ధర్మ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సాహిబ్‌జాదాల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. వారి ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కదిలివచ్చిన శ్రేణులు.. భక్తిశ్రద్ధలతో ర్యాలీ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓఎస్ రెడ్డి, అజయ్ కుమార్, నేతలు కర్ణె రమేష్ యాదవ...

December 27th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని!

Image
  పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని! హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ‘పుస్తక స్ఫూర్తి’ చర్చాగోష్ఠి క్యాన్సర్‌ను జయించేలా చేసింది అంబేద్కర్ పుస్తకమే: ప్రజాకవి జయరాజు కన్ను మూసేదాకా పెన్ను మూసేది లేదు: సుద్దాల అశోక్ తేజ అక్షరం మనిషిని అద్భుత కళాకారుడిగా తీర్చిదిద్దుతుంది: కవి యాకూబ్ హైదరాబాద్, తూఫాన్ బ్యూరో: మనిషి శరీరానికి భోజనం ఎంత అవసరమో.. మెదడుకు పుస్తకం అంతకంటే ముఖ్యమని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అన్నారు. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం సాయంత్రం అనిశెట్టి రజిత వేదికపై ‘పుస్తక స్ఫూర్తి/పుస్తకం ఒక దారిదీపం’ చర్చా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్ సభను ప్రారంభించగా, సుద్దాల అశోక్ తేజ, ప్రజాకవి జయరాజు ముఖ్య వక్తలగా పాల్గొన్నారు.  పుస్తకమే నా ఊపిరి: సుద్దాల "కన్ను మూసేదాకా పెన్ను మూసేదే లేదు.. పెన్ను మూసేదాకా కన్ను మూసేదే లేదు" అంటూ సుద్దాల తన అక్షర నిబద్ధతను చాటుకున్నారు. ఆరో తరగతిలోనే మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ పుస్తకం తనను ప్రభావితం చేసిందని, ప్రేమ్ చంద్ రచనలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని గుర...

24 ఏళ్ల వయసులోనే డివిజన్ సాధించిన విద్యార్థి నేత – అదే డివిజన్ నుంచి విజయం సాధిస్తానన్న వినయ్ కుమార్

Image
 తూఫాన్(హైదరాబాద్):- ప్రజాస్వామ్య మార్గంలో పోరాడితే ఏదైనా సాధ్యమని నిరూపించారు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకుడు వినయ్ కుమార్ (24). బాగ్‌లింగంపల్లి డివిజన్ సరిహద్దులు, పేరు మార్పు, మరియు పరిపాలనాపరమైన అవకతవకలపై ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం చివరకు ఫలించింది. కేవలం 24 ఏళ్ల ప్రాయంలోనే రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో హైకోర్టు ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారుల మెడలు వంచి, తన డివిజన్ సమస్యకు పరిష్కారం సాధించడం ఇప్పుడు నగర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల మొండివైఖరి.. హైకోర్టు జోక్యం డివిజన్ సమస్యలపై తొలుత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినయ్ కుమార్ విన్నవించినా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వెనక్కి తగ్గకుండా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వినయ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. తక్షణమే విచారణ జరపాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో దిగివచ్చిన అధికారులు విచారణ చేపట్టి, వినయ్ కుమార్ సూచించిన మార్పులను అమలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ సిద్ధాంతమే ప్రేరణ ఈ విజయంపై వినయ్ కుమార్ స్పందిస్తూ.. "రాజ్యాంగమే మన బలం" అని రాహుల్ గాంధీ చెప్పే మా...

కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు - తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

Image
తూఫాన్(హైదరాబాద్):- రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీఓలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తూ, వక్రీకరిస్తూ సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేసారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని ఆయన స్పష్టం చేసారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కొరవచ్చని ఆయన ...

December 26th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షరసేద్యం.. కవితా గానం

Image
బుక్ ఫెయిర్‌లో ఉర్రూతలూగించిన కవి సమ్మేళనం ఆలోచింపజేసిన 'దుఃఖ నది'.. అలరించిన 'బలిపీఠం' రెండు సెషన్లలో 30 మంది కవుల కవితా గానం కవులకు సాహిత్య అకాడమీ నూతన సంవత్సర క్యాలెండర్ల పంపిణీ  హైదరాబాద్:-  అక్షరాల నిధి.. పుస్తకాల కాణాచి అయిన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం సాయంత్రం కవితా గానంతో ఉర్రూతలూగింది. ఎన్టీఆర్ స్టేడియంలోని అనిశెట్టి రజిత వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, ప్రముఖ కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాములు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. రెండు సెషన్లుగా సాగిన ఈ సమ్మేళనంలో సుమారు 30 మంది కవులు పాల్గొని సమకాలీన అంశాలపై తమ కలాన్ని వినిపించారు. హృదయాలను తాకిన కవితలు  సమ్మేళనంలో ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని పంచింది. 'మా నాన్న ప్రవహించే.. దుఃఖ నది' శీర్షికతో సాగిన కవిత అందరినీ ఆలోచింపజేయగా.. 'దక్షిణ భారతదేశానికి బర్రె ఆవుతో సమానం' అంటూ ద్రవిడ దేశంలో బర్రె ప్రాముఖ్యతను చాటిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేబుల్ టీవీ స...

December 25th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షర సేద్యం.. పఠనమే భాగ్యం

Image
  ఉత్తేజంగా ‘బుక్ వాక్’.. ప్రారంభించిన సి.ఎస్. రామకృష్ణారావు ఎన్.టి.ఆర్ స్టేడియంలో సందడిగా 38వ పుస్తక ప్రదర్శన సాంకేతికత పెరిగినా తగ్గని పుస్తక ప్రాధాన్యత తరలివచ్చిన రచయితలు, సాహితీవేత్తలు, విద్యార్థులు హైదరాబాద్:-మారుతున్న ప్రపంచంలో సాంకేతికత ఎన్ని మార్పులు తీసుకొచ్చినప్పటికీ, పుస్తకానికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేర్కొన్నారు. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన *‘బుక్ వాక్’*ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బుధ‌వారం లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం నుండి ఎన్.టి.ఆర్ స్టేడియంలోని అందే శ్రీ ప్రాంగణం (బుక్ ఫెయిర్) వరకు ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది.   జ్ఞానానికి వారధి.. పుస్తకం ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ.. పుస్తకాలు అనేవి మనల్ని మరో లోకానికి తీసుకెళ్లే అద్భుతమైన కిటికీల వంటివని అభివర్ణించారు. వ్యక్తిగత వికాసం: ఇతరుల జీవిత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి పఠనం ఒక వారధిలా ఉపయోగపడుతుంద‌న్నారు.   బాహ్య ప్రపంచం వేగంగా మారినా, పుస్తకాల ద్వారా పొందే జ్ఞానం శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్...

December 24th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 23rd, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షరాల్లో ‘క్వియర్‌’ అనుభవాల ఆవిష్కరణ

Image
అక్షరాల్లో ‘క్వియర్‌’ అనుభవాల ఆవిష్కరణ - హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో ఆసక్తికరంగా సాగిన చర్చాగోష్టి - సమాజపు ముద్రలను చెరిపివేసి.. మనిషిగా చూడాలి: రచయితల ఆకాంక్ష హైదరాబాద్‌ : ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో భాగంగా ఆదివారం 'క్వియర్‌ అనుభవాలు - సాహిత్య సృజన' అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టి ఆలోచింపజేసింది. దీప్తి సిర్ల మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రచయితలు అవిజిత్‌ కుందు, పారస్‌ వత్స్‌, రచన ముద్రబోయిన, అపర్ణ తోటలు పాల్గొని తమ జీవిత ప్రయాణంలోని ఒడిదుడుకులను, సాహిత్య అనుభవాలను పంచుకున్నారు.  ముద్రలు వద్దు.. మనుషులుగా చూడండి  రచయిత అవిజిత్‌ కుందు మాట్లాడుతూ.. క్వీర్‌ సాహిత్యాన్ని కేవలం ఒక ప్రత్యేక ముద్రతో చూడకుండా, అది సమాజంలోని ఒక వర్గం నుంచి వస్తున్న సాధారణ సాహిత్యంగానే గుర్తించాలని కోరారు. తన 'మెన్ డోంట్ డ్యాన్స్' పుస్తకానికి మహిళల నుంచి కూడా విశేష స్పందన వచ్చిందని, భావోద్వేగాల పరంగా మనందరం ఒకటేనని పేర్కొన్నారు. మరో రచయిత పారస్‌ వత్స్‌ తన ఆత్మకథ 'నజీత్‌' ప్రచురణ తర్వాత ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తన అస్తిత్వాన్ని ...

December 21st, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 20th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయం కావాలి .... పుస్తక ప్రదర్శనలను జిల్లాలకు విస్తరిస్తాం: మంత్రి జూపల్లి

Image
 హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌ ప్రారంభం హైదరాబాద్‌ సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తివంతమైన ఆయుధమని, ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయంగా మారాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన 38వ హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన అనంత‌రం... పునాస మ్యాగ‌జైన్‌ ఆవిష్కరించారు.  ప్రభాత భేరి కరపత్రం...మరియు కాలెండర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేటి కాలంలోనూ ఏటా 15 లక్షల మంది పుస్తక ప్రదర్శనకు రావడం శుభపరిణామన్నారు. విలువలతో కూడిన విద్యే ముఖ్యం ప్రస్తుత విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని, ఇది మనిషిని సంస్కరించలేకపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "నాటి తరం ఆలోచనా విధానం, విలువలు నేడు కల్తీ అయిపోయాయి. కేవలం ఉద్యోగం, సంపాదన ధోరణిలో పడి మానవ జన్మ సార్థకతను మర్చిపోతున్నాం. పాత కాలపు సంస్కారం మళ్లీ రావాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాల...

ముఖ్యమంత్రితో ఆర్బీఐ గవర్నర్ భేటీ

Image
  ముఖ్యమంత్రితో ఆర్బీఐ గవర్నర్ భేటీ రాష్ట్ర ఆర్థిక విధానాలపై సంజయ్ మల్హోత్రా ప్రశంసలు విద్యుత్ సంస్కరణలు, సౌర విద్యుత్ పెంపుపై సీఎం వివరణ జూబ్లీహిల్స్ (ఈనాడు ప్రతినిధి): ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి తో భారత రిజర్వు బ్యాంకు (RBI) గవర్నర్  సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఆర్బీఐ బోర్డు సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, చేపడుతున్న పలు సంస్కరణలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.  సంస్కరణలపై ప్రత్యేక దృష్టి: రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణతో పాటు వివిధ రంగాల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. ముఖ్యంగా: విద్యుత్ రంగం: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కమ్ ఏర్పాటు ఆవశ్యకతను సీఎం తెలియజేశారు. హరిత ఇంధనం: పర్యావరణ హితమైన సోలార్ విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ఆర్థిక ప్రణాళికలు: భవిష్యత్ అవసరాలక...

December 19th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 18th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 17th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 16th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

శివాజీ మహారాజ్ 25 అడుగుల విగ్రహాన్ని విష్కరించినజ్యోతిరాదిత్య సింధియా

Image
 శివాజీ మహారాజ్ 25 అడుగుల విగ్రహాన్ని విష్కరించినజ్యోతిరాదిత్య సింధియా శివాజీ స్ఫూర్తితోనే 'వికసిత్ భారత్': కేంద్ర మంత్రి  కర్ణాటకలోని బెళగావి జిల్లా, అథనిలో మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 25 అడుగుల విగ్రహాన్ని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన ఆయన, ఇది కేవలం విగ్రహావిష్కరణ మాత్రమే కాదని, దేశ ఆత్మగౌరవం, ధైర్యం, హిందూవీ స్వరాజ్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పమని పేర్కొన్నారు. 'జై భవానీ, జై శివాజీ' నినాదం నేటికీ ప్రతి భారతీయుడిలో జాతీయ కర్తవ్యాన్ని, గర్వాన్ని రగిలిస్తోందని సింధియా అన్నారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే స్వరాజ్యం కోసం శివాజీ ప్రతిజ్ఞ చేశారని గుర్తుచేస్తూ, ఆయన ధైర్యం, వ్యూహాత్మక నాయకత్వంతో దురాక్రమణదారులను ఓడించి, భారతదేశ ఆత్మగౌరవాన్ని కాపాడారని కొనియాడారు. ఈ ప్రాంతం శివాజీ శౌర్యానికి సాక్ష్యమని, దక్కన్, కొంకణ్, గోవాలను కలిపే మార్గాలకు కీలకమని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతున్న 'వికసిత్ భారత్' లక్ష్యం, స్వావలంబన...

రామప్ప ఆలయాన్ని సందర్శించిన యునెస్కో భారత రాయబారి

Image
రామప్ప ఆలయాన్ని సందర్శించిన యునెస్కో భారత రాయబారి పారిస్ ‌నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి శ్రీ విశాల్ వీ. శర్మ 2025 డిసెంబర్ 14న తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ వారసత్వ కేంద్రమైన రుద్రేశ్వర రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు.    యునెస్కోకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్‌కు శ్రీ విశాల్ వీ. శర్మ  చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన ఇంటర్‌ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్‌గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్‌కు కూడా ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు. 2021లో రాయబారి విశాల్ వీ. శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్‌కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేం...

డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం

Image
 డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12, 13 తేదీల్లో (డిసెంబర్ 2025) నిర్వహించిన 48 గంటల 'స్పెషల్ డ్రైవ్'లో మొత్తం 460 మంది వాహనదారులు పట్టుబడ్డారు.  ​పట్టుబడిన వారిలో అత్యధికంగా 350 మంది ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. వీరితో పాటు 25 మంది ఆటో డ్రైవర్లు, 85 మంది కారు/ఇతర వాహనాల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. ​ఆల్కహాల్ మోతాదు (BAC) వారీగా కేసుల వివరాలు: బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (BAC) స్థాయిల ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి: ​30 - 50: 98 కేసులు ​51 - 100: 185 కేసులు ​101 - 150: 99 కేసులు ​151 - 200: 48 కేసులు ​201 - 250: 16 కేసులు ​251 - 300: 10 కేసులు ​300 పైన: 04 కేసులు ​'జీరో టోలరెన్స్' పాటిస్తాం: మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో 'జీరో టోలరెన్స్' (సహించేది లేదు) విధానాన్ని అవలంబిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని హెచ్చరించారు. వాహనదారులు,...

లక్షద్వీప్‌లో తొలిసారి పెట్టుబడిదారుల సదస్సు

Image
  లక్షద్వీప్‌లో తొలిసారి పెట్టుబడిదారుల సదస్సు ₹500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు; మత్స్య సంపద వినియోగమే లక్ష్యం ట్యూనా ఫిషింగ్, సీవీడ్ సాగు, అలంకార చేపల రంగాలపై కేంద్రం దృష్టి కవరత్తి/బంగారం దీవి (లక్షద్వీప్): లక్షద్వీప్ దీవులలోని అపారమైన మత్స్య సంపద సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా కేంద్ర మత్స్య శాఖ చారిత్రక అడుగు వేసింది. 2025 డిసెంబర్ 13న బంగారం దీవిలో తొలిసారిగా **పెట్టుబడిదారుల సదస్సు (Investors’ Meet)**ను నిర్వహించింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశానికి వివిధ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రులు, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ పటేల్ కూడా హాజరయ్యారు.  రూ. 500 కోట్ల పెట్టుబడుల అంచనా: కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఈ మొట్టమొదటి సదస్సుకు దేశవ్యాప్తంగా ట్యూనా, లోతైన సముద్రపు చేపల వేట, సీవీడ్ సాగు, అలంకార చేపల వాణిజ్యం వంటి రంగాలకు చెందిన సుమారు 22 మంది పెట్టుబడిదారులు మరియు కీలక వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుస్థిర వృద్ధిని సాధించే లక్ష్యంతో ₹500 కోట్లకు పైగా పెట్టుబడి ...

December 14th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబ‌ర్ 19 నుంచే

Image
  38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబ‌ర్ 19 నుంచే పుస్తక స్ఫూర్తి, బాలోత్సవంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహణ: హెచ్.బి.ఎఫ్. సొసైటీ తెలుగు ప్రముఖులు అందెశ్రీ, అనిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్‌ గౌడ్ పేర్లతో వేదికలు హైదరాబాద్ (సిటీ): తెలంగాణ సాహితీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు అద్భుత రీతిలో, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. పుస్తకం విశిష్టత, దాని ప్రయోజనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.  శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు క‌వి   యూకూబ్ , ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు , ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి , కోశాధికారి నారాయణరెడ్డి మాట్లాడారు. పుస్తక స్ఫూర్తితో కార్యక్రమాలు: పుస్తకాన్ని, దాని ప్రాముఖ్యతను సమాజానికి తెలియజెప్పడంతో పాటు, మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈసారి పుస్తక విక్రయాలు, కొనుగోళ్లతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సొసైటీ ప్రతినిధులు...