శివాజీ మహారాజ్ 25 అడుగుల విగ్రహాన్ని విష్కరించినజ్యోతిరాదిత్య సింధియా

 శివాజీ మహారాజ్ 25 అడుగుల విగ్రహాన్ని విష్కరించినజ్యోతిరాదిత్య సింధియా
శివాజీ స్ఫూర్తితోనే 'వికసిత్ భారత్': కేంద్ర మంత్రి 


కర్ణాటకలోని బెళగావి జిల్లా, అథనిలో మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 25 అడుగుల విగ్రహాన్ని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన ఆయన, ఇది కేవలం విగ్రహావిష్కరణ మాత్రమే కాదని, దేశ ఆత్మగౌరవం, ధైర్యం, హిందూవీ స్వరాజ్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పమని పేర్కొన్నారు.


'జై భవానీ, జై శివాజీ' నినాదం నేటికీ ప్రతి భారతీయుడిలో జాతీయ కర్తవ్యాన్ని, గర్వాన్ని రగిలిస్తోందని సింధియా అన్నారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే స్వరాజ్యం కోసం శివాజీ ప్రతిజ్ఞ చేశారని గుర్తుచేస్తూ, ఆయన ధైర్యం, వ్యూహాత్మక నాయకత్వంతో దురాక్రమణదారులను ఓడించి, భారతదేశ ఆత్మగౌరవాన్ని కాపాడారని కొనియాడారు. ఈ ప్రాంతం శివాజీ శౌర్యానికి సాక్ష్యమని, దక్కన్, కొంకణ్, గోవాలను కలిపే మార్గాలకు కీలకమని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతున్న 'వికసిత్ భారత్' లక్ష్యం, స్వావలంబన ఆదర్శాలు శివాజీ సిద్ధాంతంలోనే లోతుగా పాతుకుపోయాయని సింధియా తెలిపారు. జాతీయ ప్రయోజనాలే అత్యున్నతమని, స్వరాజ్య స్ఫూర్తి ఎప్పటికీ పాతబడదని ఈ విగ్రహం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి