వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం – మంత్రి కెటి రామారావు

వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం – మంత్రి కెటి రామారావు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. నగరంలో ఇళ్ల నిర్మాణ చాల వేగంగా నడుస్తున్నదని మంత్రి తెలిపారు. మెత్తం 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని సమీక్షించారు. జియచ్ యంసి తరపున ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రికి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వేగంతో ముందుకు వెళ్తే వచ్చే డిసెంబర్ నాటికి సూమారు 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతున్నదని అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వచ్చే ఏడాది జూన్ మాసం నాటికి పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో స్థానిక యంఏల్యేలు, యంపిలను మరింత భాగస్వాములను చేయడం ద్వారా పర్యవేక్షణ,...